నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి | Boy Booked For Raping Girl In Dehradun | Sakshi
Sakshi News home page

నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి

Jun 21 2019 2:25 PM | Updated on Jun 21 2019 2:25 PM

Boy Booked For Raping Girl In Dehradun - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

ఆగని దారుణాలు : నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి

హరిద్వార్‌ : మహిళలు, చిన్నారులపై లైంగిక దాడి ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. డెహ్రాడూన్‌లోని నలపాని ప్రాంతంలో నాలుగేళ్ల బాలికపై 11 సంవత్సరాల బాలుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాధితురాలు నివసించే ప్రాంతంలోనే ఉండే నిందితుడు మంగళవారం సాయంత్రం ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని తెలిపారు.

బాలికను మభ్యపెట్టి తన ఇంటికి తీసుకువెళ్లిన నిందితుడు బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడగా, పని నుంచి ఇంటికి రాగానే తన తల్లికి జరిగిన విషయం వెల్లడించింది. ఇక మరుసటి రోజు ఉదయం బాలిక తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారని డెహ్రాడూన్‌ ఎస్పీ శ్వేతా చౌబే వెల్లడించారు. బాలికపై వైద్య పరీక్షలు నిర్వహించామని నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement