బైక్‌ల దొంగ అరెస్టు | Boy Arrest in Bikes Robbey Case Krishna | Sakshi
Sakshi News home page

బైక్‌ల దొంగ అరెస్టు

Nov 13 2018 1:12 PM | Updated on Nov 13 2018 1:12 PM

Boy Arrest in Bikes Robbey Case Krishna - Sakshi

స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలతో ఎస్‌ఐ హరిబాబు

కృష్ణాజిల్లా, జగ్గయ్యపేట: పట్టణంలో ఆరుబయట పార్కు చేసిన ద్విచక్ర వాహనాల చోరీకి పాల్ప డుతున్న బాలుడిని అరెస్ట్‌ చేసినట్లు పట్టణ ఎస్‌ఐ హరిబాబు సోమవారం చెప్పారు. ఆ యన కధనం ప్రకారం పట్టణానికి చెందిన బాలుడు కొంత కాలంగా ఇళ్ల ముందు పార్క్‌ చేసి ఉన్న ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్నాడు. ఈ మేరకు ద్విచక్ర యజమానులు ఫిర్యాదు చేయటంతో కేసును విచారించి పట్ట ణానికి చెందిన బాలుడిగా గుర్తించారు. మ ధ్యాహ్న సమయంలో ముక్త్యాల రోడ్డులోని పెట్రోల్‌ బంకు వద్ద అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement