గూడ్స్ బోగీలో రక్తపు సంచి.. చూస్తే చనిపోయిన కుక్క

రైల్వేగేట్: ఓ గూడ్స్ రైలులోని ఖాళీ బోగీలో రక్తం కారుతున్న కట్టు కట్టి ఉన్న ఓ సంచి సిబ్బందికి కనిపించింది. దీంతో వారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. తీరా దానిని తెరచి చూస్తే చనిపోయిన కుక్క కనిపించింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ సంఘనటన ఆదివారం మధ్యాహ్నం వరంగల్ గూడ్స్ షెడ్‌లోని రైలు బోగీలో జరిగింది. వరంగల్ జీఆర్‌పీ ఏఎస్సై పరశురాములు కథనం ప్రకారం.. పీడీఎస్ బియ్యం లోడ్ చేసుకుని తీసుకెళ్లేందుకు గద్వాల నుంచి హైదరబాద్ కాచిగూడ, అక్కడి నుంచి వరంగల్‌కు వచ్చిన గూడ్స్‌రైలులోని ఓ ఖాళీ బోగీలో సంచి కనిపించింది.
అది కూడా రక్తం కారుతుండడంతో అనుమానం వచ్చిన గూడ్స్ షెడ్ సిబ్బంది స్టేషన్ డిప్యూటీ మేనేజర్‌కు సమాచారం ఇవ్వడంతో అతను జీఆర్‌పీ పోలీసులకు చెప్పారు. దీంతో సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు సంచిని బయటకు తీయించి విప్పగా అందులో చనిపోయి ఉన్న కుక్క కనిపించింది. దీంతో అక్కడ ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు..
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి