బైక్‌ దొంగ అరెస్ట్‌ | Bike Theft Was Arrested | Sakshi
Sakshi News home page

బైక్‌ దొంగ అరెస్ట్‌

Apr 8 2018 7:50 AM | Updated on Nov 6 2018 8:50 PM

Bike Theft Was Arrested - Sakshi

పట్టుబడ్డ బైక్‌ దొంగతో సీఐ, పట్టణ ఎస్సై, సిబ్బంది

సాలూరు : పార్క్‌ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న యువకుడిని పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేశారు. శనివారం స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో సీఐ ఇలియాస్‌ మహ్మద్‌ తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. సాలూరు మండలం నెలిపర్తి గ్రామానికి చెందిన సేనాపతి శంకరరావు అలియాస్‌ రామకృష్ణ సాలూరు పట్టణంలో మూడు బైక్‌లు.. మెంటాడ మండలం ఆండ్ర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక బైక్‌ను దొంగిలించాడన్నారు. క్రైమ్‌ పోలీసులు విచారణ జరిపి దొంగతనాలకు పాల్పడుతున్న శంకరరావును పట్టుకుని బైక్‌లను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు.

అనుమానితుల సమాచారం ఇవ్వండి..
పట్టణ ఎస్సై ఫకృద్దీన్‌ మాట్లాడుతూ, పట్టణంలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఇళ్ల వదిలి వేరే ఊర్లకు వెళ్లేవారు కూడా సమాచారం ఇవ్వాలని కోరారు.  అంతేగాకుండా మైనర్లు వాహనాలను నడిపితే వారి తల్లిదండ్రులపై కేసులు పెడతామని చెప్పారు.
  

Advertisement
 
Advertisement
Advertisement