టాపర్‌ కాలేదని... గన్‌తో కాల్చుకుంది

Become Upset Over Not Topping Class Girl Shoots Herself - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తాను ఆశించినట్టుగా టాప్‌ ర్యాంక్‌ రాలేదని మనస్తాపానికి గురై ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన హరియాణాలో చోటుచేసుకుంది. జింద్‌ జిల్లాలోని ఓ స్కూల్‌ బాలిక...పరీక్షల్లో స్కూల్‌ టాపర్‌గా నిలుస్తుందని ఆశించింది. కానీ తీరా టాపర్‌ కాలేదని తెలిసి సోమవారం తన తండ్రి వద్ద ఉన్న గన్‌తో కాల్చుకుని తనువు చాలించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సివాహ గ్రామ సర్పంచ్‌ వేద్‌పాల్‌ సింగ్‌ కుమార్తె అంజలి కుమారి ఇండస్‌ పబ్లిక్‌ స్కూల్‌లో 11వ తరగతి చదువుతోంది. తాజాగా వెలువడిని ఫలితాల్లో తాను ఆశించినట్టుగా టాప్‌ ర్యాంక్‌ రానందుకు తీవ్ర మనస్తాపానికి లోనయింది. భావోద్వేగం నియంత్రించుకోలేక తన తండ్రి వద్ద ఉండే గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం నాడు ఆ కుటుంబం అంతా దగ్గర్లోని వేరే గ్రామానికి వెళ్లింది. ఆ సమయంలో అంజలి ఇంటి వద్దే ఉంది.  తొందరగా ఇంటికి రమ్మని తన తండ్రికి ఫోన్‌ చేసింది. కానీ వచ్చేసరికి బాత్రూమ్‌లో ​కాల్చుకుని పడి ఉంది. ఆస్పత్రికి తరలించ క్రమంలో మరణించిందని వైద్యులు తెలిపారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు పోలీసులు తెలిపారు. కాగా హరియాణా ఆర్థిక మంత్రి కెప్టెన్‌ అభిమన్యు ఆ స్కూల్‌ యజమాని​ కావడం గమనార్హం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top