ఆ నటి బీఎండబ్ల్యూను ఢీ కొట్టిన ఆటోడ్రైవర్‌ అరెస్ట్‌.. | Sakshi
Sakshi News home page

ఆ నటి బీఎండబ్ల్యూను ఢీ కొట్టిన ఆటోడ్రైవర్‌ అరెస్ట్‌..

Published Thu, Nov 22 2018 9:26 AM

Auto Driver Arrested In Mumbai For Banging Rickshaw Into Actress Sophie Chaudharys BMW - Sakshi

ముంబై : నటి సోఫీ చౌదరి ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూను ఢీకొన్న ఆటో డ్రైవర్‌ను ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. బుధవారం రాత్రి ఖర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ సంఘటన జరిగింది. అతివేగంతో కారు నడుపుతూ ప్రాణాలతో చెలగాటమాడిన నేరారోపణలపై ఆటో డ్రైవర్‌ 22 సంవత్సరాల అనీస్‌ అహ్మద్‌పై కేసు నమోదు చేశారు.

ఈ ఘటనలో సోఫీ చౌదరికి ఎలాంటి గాయాలు కాలేదని, సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. నిందితుడు అనీస్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement