
గాయాలు చూపుతున్న మహిళ
టెక్కలి రూరల్ : మహిళ మెడలో చైన్‌ను దొంగిలించేందుకు దుండగులు ప్రయత్నించిన సంఘటన మండలంలోని చింతలగర్రలో బుధవారం జరిగింది. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సిగిలిపల్లి నారాయణమ్మ రహదారిపై వెళుతుండగా వెనుక నుంచి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి మెడలోని చైన్‌ను దొంగిలించేందుకు ప్రయత్నించారు.
దీంతో అమె కిందకు పడిపోయింది. చైన్ తెంపుకొని పరారయ్యే ప్రయత్నంలో దుండగులు కింద పడిపోయారు. ఈ క్రమంలో చైన్ తుళ్లిపోవడంతో అక్కడి నుంచి పరారయ్యరని తెలిపారు. ఈ ఘటనలో నారాయణమ్మకు స్వల్ప గాయాలయ్యాయి.
ఈ వేసవిలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మహిళలు వాపోతున్నారు. రోజూ ఉదయం వాకింగ్‌కు ఇదేమార్గంలో వెళుతుంటామని ఈ ఘటనల వల్ల భయాందోళనకు గురవుతున్నామని ఆందోళన చేస్తున్నారు. ఈ విషయమై టెక్కలి ఎస్‌ఐ సురేష్‌బాబు వివరణ కోరగా ద్విచక్రవాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.