దాసరి కోడలిపై దాడి

Attack On Dasari Narayana Rao Daughter In Law - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తన భర్త మొదటి భార్య అర్ధరాత్రి తన ఇంట్లోకి చొరబడటమే కాకుండా తనపై దాడి చేసి గాయపరిచిందని దర్శకరత్న, దాసరి నారాయణరావు కుమారుడు దాసరి తారక హరిహర ప్రభు సతీమణి దాసరి పద్మ జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 46లో తాను భర్తతో కలిసి ఉంటున్నానని ఈ నెల10వ తేదీ రాత్రి 7 గంటలకు తన భర్త మొదటి భార్య సుశీల, మరో మహిళ సంధ్యతో కలిసి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి నీ భర్త ఎక్కడని గొడవపెట్టుకోవడమేగాక, అక్కడే బైఠాయించిందన్నారు.

దీంతో తానే ఈ విషయాన్ని తన సోదరుడు నార్ల కోడి, సోదరి లక్ష్మిప్రభ దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఆ రాత్రి సుశీల, సంధ్య ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారని, ఈ నెల 11న తెల్లవారుజామున కిచెన్‌లోకి వెళ్తున్న తనపై సుశీల, సంధ్య కర్రతో దాడి చేసినట్లు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దాసరి సుశీలపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, తారక హరిహర ప్రభు ఆస్తిలో తనకూ వాటా ఉందని సుశీల వాదిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top