
ముంబై: ఇద్దరిని ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలపై రిపబ్లిక్ టీవీ ఎడిటర్–ఇన్–చీఫ్ అర్ణబ్ గోస్వామి సహా ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ ఎండీ అయిన అన్వయ్ నాయక్, ఆయన తల్లి శనివారం ముంబై సమీపంలోని వారి ఫాం హౌస్‌లో ఆత్మహత్య చేసకుని చనిపోయారు.
అన్వయ్ సూసైడ్ నోట్ రాస్తూ అర్ణబ్ గోస్వామితోపాటు ఫెరోజ్ షేక్, నితీశ్ సర్దా అనే వ్యక్తులు తనకు రూ. 5.4 కోట్లు చెల్లించాలనీ, కానీ వాళ్లు ఆ డబ్బు ఇవ్వకుండా వేధిస్తూ తమ ఆత్మహత్యలకు కారణమయ్యారని పేర్కొన్నారు. అన్వయ్ ఆరోపణలు అవాస్తవాలంటూ ఆదివారం రిపబ్లిక్ టీవీ ఓ ప్రకటన విడుదల చేసింది.