
సాహిత్య (ఫైల్)
బనశంకరి: పాలికె చెత్త లారీ ఢీకొని ఆర్కిటెక్చర్ విద్యార్థిని మృతి చెందిన సంఘటన ఉప్పారపేటే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు...రాజాజీ నగర నివాసి నరసరాజ్ ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తున్నాడు. ఇతని కుమార్తె బీఎన్.సాహిత్య(24) హెసరఘట్ట సమీపంలోని ఇంజనీరింగ్ కాలేజీ ఆర్కిటెక్చర్ చివరి సంవత్సరం చదువుతోంది.
ఇక్కడి కన్నింగ్‌హ్యామ్ రోడ్డులో ఇంటర్న్‌షిప్ చేస్తోంది. మంగళవారం ఉదయం కంపెనీకి స్కూటర్‌లో బయలుదేరిన సాహిత్య రేస్‌కోర్సు రోడ్డులో వెళుతుండగా వెనుక నుంచి బీబీఎంపీ చెత్త లారీ ఢీకొనడంతో సాహిత్య లారీ చక్రాల కింద పడి నలిగిపోయింది. లారీ డ్రైవర్ పరారీ కగా పోలీసుసు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని విక్టోరియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.