సౌమ్య కేసులో మరో కోణం.. ! | another angel in soumya murder case | Sakshi
Sakshi News home page

సౌమ్య కేసులో మరో కోణం.. !

Oct 7 2017 1:30 PM | Updated on Nov 9 2018 4:36 PM

another angel in soumya murder case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సౌమ్య హత్య కేసులో మరో కొత్త కోణం వెలుగు చూసింది. సౌమ్యకు రెండేళ్ల క్రితమే వివాహమైందని... విడాకులు కూడా తీసుకుందని బంధువులు చెప్తున్నారు. ఇంటర్‌లో ఉన్న సమయంలోనే సౌమ్యకు పెళ్లి చేశారని, అయితే, ఆ పెళ్లి నచ్చకపోవడంతో ఆమె అత్తింటికి వెళ్లలేదని, ఆ తర్వాత విడాకులు తీసుకున్నారని బంధువులు వివరించారు. కృష్ణయ్యకు సౌమ్యకు మరదలు అవుతుందని, వీరి మధ్య ఎలా అనుబంధం ఏర్పడిందన్న విషయం తెలియదని, అతను ఎందుకు హత్య చేశాడో తెలియదని చెప్పారు.

సౌమ్య హత్యతో ఆమె కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సౌమ్య మృతదేహాన్ని వెలికితీసిన ఐడీఎల్‌ చెరువు వద్ద సౌమ్య తల్లి, ఇతర కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరులను కలిచివేసింది. తమ బిడ్డను కృష్ణయ్య అన్యాయంగా పొట్టనబెట్టుకున్నాడని ఆమె కుటుంబసభ్యులు విలపిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement