డ్రోన్‌ దాడిలో తీవ్రవాదులు హతం | Al Qaeda suspected terrorists killed in Drone attack | Sakshi
Sakshi News home page

డ్రోన్‌ దాడిలో తీవ్రవాదులు హతం

Nov 26 2017 7:25 PM | Updated on Aug 17 2018 7:36 PM

Al Qaeda suspected terrorists killed in Drone attack - Sakshi - Sakshi

ఎడెన్‌(యెమెన్‌): దక్షిణ యెమెన్‌లో అల్‌ఖైదా లక్ష్యంగా జరిగిన డ్రోన్‌ దాడిలో ఏడుగురు తీవ్రవాదులు హతమయ్యారు. యెమెన్‌పై డ్రోన్‌ దాడులు జరిపే సత్తా ఒక్క అమెరికా ఉందని పరిశీలకులు చెబుతున్నారు. షాబా ప్రావిన్స్‌ నుంచి బేడా ప్రావిన్స్‌కు వెళ్లే మార్గంలో వెళ్తున్న మూడు వాహనాలపై అమెరికాకు చెందిన డ్రోన్‌ ఒకటి బాంబు దాడి చేసినట్లు తమకు సమాచారం ఉందని అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ దాడిలో ఏడుగురు చనిపోయారని భావిస్తున్నారు. యెమెన్‌ కేంద్రంగా నడుస్తున్న అల్‌ఖైదా విభాగం ఈ ప్రాంతంలో చురుగ్గా కార్యకలాపాలు సాగిస్తోందని కొంతకాలంగా అమెరికా అనుమానిస్తోంది. ఈ తీవ్రవాదులకు సౌదీ అరేబియా మద్దతు ఇస్తూ స్థానిక హుతి రెబల్స్‌పై ఉసిగొలుపుతోంది. కానీ, డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అల్‌ఖైదాపై అమెరికా డ్రోన్‌ దాడులు సాగిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement