హీరోయిన్‌ ముందు పోలీసాఫీసర్‌ హీరోయిజం

Additional DCP Gangi Reddy beat Short Film Director Yogi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  సైబరాబాద్‌ అడిషనల్‌ డీసీపీ గంగిరెడ్డి తీరు వివాదాస్పదంగా మారింది. షార్ట్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌ యోగిని కాలుతో తన్నటం మీడియాలో హల్‌ చల్ చేస్తోంది. 

తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడంటూ షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ హారిక హైదరాబాద్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనను శారీరకంగా లొంగదీసుకునేందుకు యోగి యత్నించాడని, రెమ్యునరేషన్‌ కూడా ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు, యోగిని పిలిపించి గంటన్నర సేపు విచారించారు. 

అయితే, ఈ క్రమంలో యోగిని గంగిరెడ్డి బూటుతో తన్నారు. కౌన్సిలింగ్‌ పేరుతో పీఎస్‌కు పిలిచి మరీ చితకబాదారు. అయితే స్టేషన్‌ లో కూడా హారిక పట్ల యోగి దురుసుగా ప్రవర్తించినట్టు అధికారి చెబుతున్నప్పటికీ... యోగి మాత్రం వాటిని ఖండించాడు. పారితోషకం ఎప్పుడో ఇచ్చేశానని.. తాను చెప్పేది వినకుండా అధికారి తనపై చెయ్యి చేసుకున్నారని యోగి చెబుతున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top