మోదీ అన్న కూతురి పర్స్‌ దొంగల అరెస్ట్‌ | Accused who Robbed PM Narendra Modi Niece Arrested | Sakshi
Sakshi News home page

మోదీ అన్న కూతురి పర్స్‌ దొంగల అరెస్ట్‌

Oct 14 2019 10:31 AM | Updated on Oct 14 2019 10:31 AM

Accused who Robbed PM Narendra Modi Niece Arrested - Sakshi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అన్న కూతురు దమయంతి బెన్‌ మోదీ పర్స్‌ దొంగిలించిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. శనివారం ఉదయం ఉత్తర ఢిల్లీలోని సివిల్‌ లైన్స్‌ వద్ద ఆటోలో నుంచి దిగిన దమయంతి పర్స్‌ను బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు లాక్కెళ్లిన సంగతి తెలిసిందే. పర్స్‌లో 56 వేల రూపాయల నగదు, రెండు ఫోన్లు, ఇతర పత్రాలు ఉన్నాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో దమయంతి పేర్కొన్నారు. దొంగతనం జరిగిన ప్రాంతంలోని సీసీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు బైక్‌ నంబర్‌ ఆధారంగా నిందితులైన గౌరవ్‌ అలియాస్‌ నోను (21)ను హరియాణాలోని సోనిపట్‌లో, బాదల్‌ను సుల్తాన్‌పురిలో అరెస్ట్‌ చేశారు.  (చదవండి: మోదీ సోదరుని కుమార్తెకు చేదు అనుభవం)

Advertisement
 
Advertisement
Advertisement