నేటితో ముగియనున్న శ్రీనివాస్‌ కస్టడీ | Accused Srinivas Custody To End With Friday | Sakshi
Sakshi News home page

నేటితో ముగియనున్న శ్రీనివాస్‌ కస్టడీ

Nov 2 2018 10:55 AM | Updated on Sep 19 2019 2:50 PM

Accused Srinivas Custody To End With Friday - Sakshi

నిందితుడు జానిపల్లి శ్రీనివాస రావు

శ్రీనివాస్‌ నుంచి అదనంగా ఎలాంటి సమాచారాన్ని సిట్‌ రాబట్టలేకపోయినట్లు

విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం చేసిన శ్రీనివాస్‌ పోలీసు కస్టడీ నేటితో ముగియనుంది. పోలీసులు గత ఆరు రోజులుగా శ్రీనివాస్‌ను విచారించడంతో పాటు, అతని కాల్‌ డేటాను విశ్లేషించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 40 మందిని విచారించారు. శ్రీనివాస్‌ నుంచి అదనంగా ఎలాంటి సమాచారాన్ని సిట్‌ రాబట్టలేకపోయినట్లు తెలిసింది. శ్రీనివాస్‌ పోలీసు కస్టడీ పొడిగింపు కోసం సిట్‌, కోర్టులో పిటిషన్‌ వేసే ఆలోచనలో ఉంది.



విచారణ తీరు పరిశీలిస్తే కుట్ర కోణంలో సిట్‌ దర్యాప్తు సాగుతున్నట్లు కనపడం లేదని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నాయి. ఈ కేసులో కీలక నిందితుడు జానిపల్లి శ్రీనివాస్‌ తనకు ప్రాణహాని ఉందంటూ చెప్పడంతో ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌, విశాఖపట్నం సీపీలకు జాతీయ ఎస్సీ కమిషన్‌ నోటీసులు కూడా జారీ చేసింది. నిందితుడు శ్రీనివాస్‌కు ప్రాణహానిపై ఎస్సీ కమిషన్‌ నివేదిక కూడా కోరింది. 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని నోటీసులో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement