బాలుడిపై యాసిడ్‌ దాడి | 9 years old boy attacked by acid  | Sakshi
Sakshi News home page

బాలుడిపై యాసిడ్‌ దాడి

Oct 25 2017 12:46 PM | Updated on Aug 17 2018 2:10 PM

సాక్షి, విజయనగరం: ఇంటి సమీపంలో ఆడుకుంటున్న బాలుడిపై గుర్తు తెలియని దుండగులు యాసిడ్‌ దాడి చేశారు. ఈ సంఘటన విజయనగరం జిల్లాలోని జామి మండలం తాండ్రంగి గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన సాయి(9) అనే బాలుడు నిన్న సాయంత్రం  ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో ఓ వ్యక్తి యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడు.

దీంతో చిన్నారిని హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా.. బాలుడి చెప్పిన ఆధారాల ప్రకారం గండి కృష్ణ అనే వ్యక్తి దాడికి పాల్పడినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement