మహిళపై లైంగిక దాడి.. | 40 Years Old Woman Molested In Rangampeta | Sakshi
Sakshi News home page

ముకుందవరం వెళ్తున్నా వస్తావా అని తోటలోకి తీసుకెళ్లి..!

Mar 18 2020 9:14 AM | Updated on Mar 18 2020 9:27 AM

40 Years Old Woman Molested In Rangampeta - Sakshi

లైంగిక దాడి జరిగిన పామాయిల్‌ తోటను పరిశీలిస్తున్న సీఐ జయకుమార్‌ తదితరులు

సాక్షి, రంగంపేట: పామాయిల్‌ తోటలో 40 ఏళ్ల మహిళపై లైంగిక దాడి ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సీహెచ్‌ సుధాకర్‌ తెలిపారు. ముకుందవరానికి చెందిన మహిళ సోమవారం ఉదయం కడుపు నొప్పితో స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని తిరిగి వెళ్లేందుకు స్థానిక సంత మార్కెట్‌ వద్ద కూర్చుందని తెలిపారు. రంగంపేటకు చెందిన మాంసం విక్రయించే అమలదాసు వీరబాబు మోపెడ్‌పై వెళుతూ.. ముకుందవరం వెళుతున్నా.. వస్తావా అంటూ అడిగాడు. మోపెడ్‌పై ఆమెను తీసుకువెళుతూ మార్గం మధ్యలో కోరిక తీర్చాలని అడిగితే ఆమె నిరాకరించింది. చదవండి: స్మార్ట్‌గా వ్యభిచారం.. కాలేజీ యువతులు కూడా! 

దీంతో ముకుందవరం గ్రామ సమీపంలో ఉన్న పామాయిల్‌ తోటలోకి మోపెడ్‌ను తీసుకువెళ్లి ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఆమె షాక్‌తో తోటలో గంటకు పైగా ఉండిపోయింది. ముకుందవరానికి చెందిన పత్తి శ్రీను అనే వ్యక్తి ద్వారా ఆమె మంగళవారం ముకుందవరం మహిళా పోలీసు మాచర్ల యాష్ణప్రియకు తెలిపింది. బాధితురాలిని ఆమె పోలీస్‌ స్టేషన్‌కు తీసుకురావడంతో కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. పెద్దాపురం సీఐ జయకుమార్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారని తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని ఎస్సై తెలిపారు. చదవండి: ప్రేమ వల; తల్లయిన పీయూసీ బాలిక

Advertisement
 
Advertisement
Advertisement