యూపీలో దారుణం: చిన్నారిపై అఘాయిత్యం | 3 year old Girl raped And Locked Inside Box In Utter Pradesh | Sakshi
Sakshi News home page

యూపీలో దారుణం: చిన్నారిపై అఘాయిత్యం

Apr 5 2018 1:57 PM | Updated on Jul 23 2018 8:49 PM

3 year old Girl raped And Locked Inside Box In Utter Pradesh - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

లక్నో : అభం శుభం తెలియని మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, బాక్సులో బంధించి తాళం వేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ పట్టణం పరిధిలోని తండాలో చోటుచేసుకుంది. ఏప్రిల్‌ 2న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  చిన్నారిని ఇంట్లోనే ఉంచి బయటికి వెళ్లిన తల్లిదండ్రులను గమనించిన 18 ఏళ్ల పక్కింటి యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. 

చాక్లెట్‌ ఇస్తానని చెప్పి తన గదికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక గట్టిగా ఏడవడంతో భయంతో తన గదిలోని ట్రంకు పెట్టలో బంధించి తాళం వేసి పరారయ్యాడు. బాలిక ఏడుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి చిన్నారిని కాపాడారు. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై పోస్కో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్) యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement