లోయలో పడ్డ బస్సు ..19 మంది మృతి | 19 die in Philippines bus crash | Sakshi
Sakshi News home page

లోయలో పడ్డ బస్సు ..19 మంది మృతి

Mar 21 2018 9:08 AM | Updated on Apr 7 2019 3:24 PM

19 die in Philippines bus crash  - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మనీలా: దక్షిణ ఫిలిఫ్పైన్స్‌ ఒక్సిడెంటల్‌ మిన్‌డోరో ప్రావిన్స్‌లోని సబ్లాయన్‌ పట్టణ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 19 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 9.30 గంటలకు జరిగిందిని విపత్తు నిర్వహణాధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను దగ్గరలోని మూడు ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. చనిపోయిన వారిలో  బస్సు డ్రైవర్‌ కూడా ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement