బాలికపై స్నేహితుల అత్యాచారం | 16 year old Girl molestation by Two Men on Pretext of Celebrating Friendship Day | Sakshi
Sakshi News home page

బాలికపై స్నేహితుల అత్యాచారం

Aug 7 2018 2:59 AM | Updated on Aug 25 2018 6:09 PM

16 year old Girl molestation by Two Men on Pretext of Celebrating Friendship Day - Sakshi

థానే: స్నేహితుల దినోత్సవం పేరు చెప్పి ఓ బాలికను పార్టీకి ఆహ్వానించిన ఇద్దరు స్నేహితులు..ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని థానేలో జరిగింది. స్నేహితుల రోజు వేడుకను చేసుకుందాం రమ్మని ఆదివారం సాయంత్రం బాలిక(16) వద్దకు ఆమె ఇద్దరు స్నేహితులు వచ్చారు. తెలిసినవారు కావటంతో ఆమె వారి వెంట వెళ్లింది.

తర్వాత నిందితులిద్దరూ బాలికను బైక్‌ డోమ్‌బివ్లీలోని ఓ పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లి రేప్‌ చేశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించిన నిందితులు..ఆమెను ఇంటి వద్ద దింపారు. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరు విద్యార్థి కాగా, మరొకరు చేపల వ్యాపారం చేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement