breaking news
case register
-
Andhra Pradesh: దమన నీతి.. అరాచక రీతి
‘అమ్మకు నిల్లు.. నాన్నకు ఫుల్లు’ అని సోషల్ మీడియాలో పోస్టు పెడితే పోలీసు కేసు.. పోలీస్ స్టేషన్లోనే వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడి చేసిన టీడీపీ నేతలపై మాత్రం కేసే లేదు..‘మద్యం వద్దు... బడి ముద్దు’ అని పోస్టు పెడితే వెంటనే కేసు 3 వేల కుటుంబాలు గ్రామాలు విడిచి వెళ్లేట్టు చేసిన టీడీపీ గూండాలపై మాత్రం కేసులు లేవు.. ‘మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ’ అని పోస్టు పెడితే పోలీసు కేసు.. లోకేశ్ ఫొటో ముందు మోకరిల్లి క్షమాపణ చెప్పకపోతే చంపేస్తామని బెదిరిస్తే మాత్రం కేసు లేదు.. ‘రైతుకు పెట్టుబడి సాయం ఎప్పుడు ఇస్తారు’ అని పోస్టు పెడితే కేసు..మద్యం దుకాణానికి టెండరుదాఖలు చేసిన ఓ వ్యాపారిపై దాడి చేస్తే మాత్రం కేసే లేదు..ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ విజయభారతికి ఫిర్యాదు చేస్తున్న వైఎస్సార్సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడా రఘునాథ్‌రెడ్డి, డాక్టర్ తనూజరాణి, గొల్ల బాబురావు టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. కూటమి పార్టీల విశృంఖలత్వం వికటాట్టహాసం చేస్తోంది. రాజ్యాంగాన్ని కాలరాస్తూ అరాచక కేళి సృష్టిస్తోంది. పాలకులను ప్రశ్నించే హక్కు పౌరులకు లేదని స్వీయ తీర్పు ఇచ్చుకుంది. కాదు కూడదని ప్రశ్నించే సోషల్ మీడియా యాక్టివిస్టులే లక్ష్యంగా అరాచకానికి తెగబడుతోంది. పోలీసులను అడ్డుపెట్టుకుని రాజ్యాంగ ధర్మాన్ని మంటగలుపుతూ పౌర హక్కులను కాలరాస్తోంది. వారి ద్వారా ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులతో విరుచుకుపడుతోంది. అదుపులోకి తీసుకున్న వారిని 24 గంటల్లో న్యాయ స్థానంలో హాజరు పరచకుండా నిరంకుశంగా వ్యవహరిస్తోంది. మహిళలు, వృద్ధులు.. అన్న విచక్షణ లేకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తోంది. ఎఫ్ఐఆర్లలో అక్కసున్న వారి పేర్లు చేరుస్తోంది. ఒక్కొక్కరిపై ఐదారు కేసులు నమోదు చేయిస్తూ రాక్షసానందం పొందుతోంది. నాలుగైదు రోజుల్లోనే 147 అక్రమ కేసులు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం.భావ ప్రకటన స్వేచ్ఛకు ఆధునిక కాల వేదికగా నిలుస్తున్న సోషల్ మీడియాను అక్రమ కేసుల ఉక్కు సంకెళ్లతో బంధించేందుకు ఈ సర్కారు విఫలయత్నం చేస్తోంది. ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండపై ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు. - సాక్షి, అమరావతి, నెట్ వర్క్నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడి ఆ చిన్నారిని కనిపించకుండా చేసినా నేటికీ ఆచూకీ కనిపెట్టలేదు... కానీ... అదే నంద్యాల జిల్లాలో పత్రికల్లో ప్రచురితమైన ప్రభుత్వ వ్యతిరేక కథనాలను సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేశాడని ఫిర్యాదు వచ్చిన వెంటనే ఆ వ్యక్తిని కనిపెట్టి అరెస్ట్ చేశారు. మీడియా కథనాలు పోస్టు చేశాడని.. పత్రికల్లో ప్రచురితమైన ప్రభుత్వ వ్యతిరేక కథనాలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడని, టీడీపీ నేతలను కించపరిచే పోస్టులను ఫార్వర్డ్ చేశాడని నంద్యాల జిల్లా మహానంది మండలం బొల్లవరం గ్రామానికి చెందిన తిరుమల కృష్ణ అలియాస్ జగన్ కృష్ణపై ఈ నెల 3వ తేదీన కేసు నమోదు చేశారు. అతనిపై కేసు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు అదే రోజు రాత్రి కర్నూలు సీసీఎస్ పోలీసులు వెల్లడించారు. నాలుగో తేదీ కర్నూలు ఎక్సైజ్ కోర్టు ఇన్చార్జ్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరుచగా రిమాండ్ విధించారు. కృష్ణను పోలీసులు కర్నూలు జిల్లా జైలుకు తరలించారు. పిల్లలతో బహిరంగంగా మద్యం విక్రయించేవారిపై చర్యలు శూన్యం... విద్య వద్దు.. మద్యం ముద్దు.. అని ప్రభుత్వ తీరును నిరసిస్తూ పోస్టు పెడితే మాత్రం అరెస్ట్... విద్య వద్దు... మద్యం ముద్దు అన్నందుకు..శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం వీరచిన్నయ్యగారిపల్లికి చెందిన మలక అమర్నాథ్రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్నారని, చంద్రబాబు, లోకేశ్‌లను సామాజిక మాధ్యమాల్లో దుర్భాషలాడుతున్నారని కదిరికి చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ నెల 2న కదిరి రూరల్ అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ‘విద్య వద్దు.. మద్యం ముద్దు, నాన్నకు ఫుల్.. అమ్మకు నిల్’ అనే పోస్టులు పెట్టాడని అమర్నాథ్రెడ్డిపై కేసు నమోదు చేశారు. అమర్ నాథ్రెడ్డిని పోలీసులు విచారణ పేరిట స్టేషన్ చుట్టూ తిప్పు కుని ఇబ్బంది పెట్టారు. చివరకు న్యాయ వాదుల సాయంతో బెయిల్ తెచ్చుకున్నాడు. అయినప్పటికీ మరోసారి అదుపులోకి తీసుకున్నారు.శ్రీకాకుళం నగరంలో ఓ మహిళను వివస్త్రను చేసి ఒంటిపై కారం చల్లి కొడితే చర్యలు లేవు... కానీ... అదే జిల్లాలో ఓ వృద్ధురాలు పింఛను కోసం వెళ్లి సొమ్మసిల్లి పడిపోయిందని సోషల్ మీడియాలో ఫొటో పెడితే మాత్రం నిర్బంధిస్తారు? వృద్ధురాలి వేదనను వివరించిందుకు..శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవులో ఈ నెల 1న బైనపల్లి దానమ్మ అనే వృద్ధురాలు పింఛన్ల కోసం వేచి చూస్తూ సొమ్మసిల్లి పడిపోయారు. ఆ విషయాన్ని అదే మండలం కొండపల్లి గ్రామానికి చెందిన మడ్డు జశ్వంత్ సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో టీడీపీ నాయకులు అతనిపై కక్ష కట్టి పోలీసుల చేత అక్రమ కేసులు పెట్టించారు. పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి గంటల కొద్దీ ఉండి కుటుంబ సభ్యులను వేధించారు. ఎలాంటి నోటీసూ ఇవ్వలేదు. జశ్వంత్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లి కనీసం భోజనం పెట్టలేదు. ఇప్పటికీ పిలుస్తూనే ఉన్నారు. ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వలేదని బాధితుడు చెబుతున్నాడు. దళిత వైద్యుడి చొక్కా పట్టుకుని ఎమ్మెల్యే దాడికి ప్రయత్నించినా... విధుల్లో ఉన్న ఎస్ఐని మంత్రి భార్య దుర్భాషలాడినా నో యాక్షన్... పవన్‌కళ్యాణ్‌పై మంద కృష్ణమాదిగ తీవ్ర ఆగ్రహం... అని ఓ వ్యక్తి వాట్సాప్ గ్రూపులో పెడితే.. ఆ గ్రూపులో ఉన్నవారికి పోలీసు నోటీసులు వాట్సాప్ గ్రూపులో ఉన్నందుకు..ఎన్టీఆర్ జిల్లా పెండ్యాల గ్రామానికి చెందిన హనుమంతరావు ఒక వాట్సాప్ గ్రూపులో ఉన్నారు. ఆ గ్రూపులో ఇటీవల ‘పవన్‌కళ్యాణ్‌పై మంద కృష్ణమాదిగ తీవ్ర ఆగ్రహం. సీఎం చంద్రబాబును కలిసిన అనంతరం మంద కృష్ణ... పవన్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు.’ అని మరో వ్యక్తి పోస్ట్ పెట్టారు. కానీ, ఆ గ్రూపులో ఉన్నందుకు హనుమంతరావుకు పోలీసులు నోటీసు ఇచ్చారు. ఎన్నికల తర్వాత 179 మంది అత్యంత ఘోరంగా, దారుణంగా హత్యకు గురైనా నిందితులపై చర్యలు శూన్యం... కానీ... ఎన్నికల ముందు చంద్రబాబు అరెస్టుపై ఫొటోను ఫేస్బుక్లో పెడితే మాత్రం కేసు కట్టి రోజూ స్టేషన్‌కు పిలిచి వేధింపులు... బాబు అరెస్ట్ ఫొటో షేర్ చేసినందుకు..వినోద్ పెట్టిన పోస్టు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట గ్రామానికి చెందిన పిళ్లెం వినోద్ ప్రైవేట్ ఎలక్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఎన్నికల సమయంలో చంద్రబాబు అరెస్టయినప్పటి ఫొటో ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఈ నెల 2న వినోద్‌పై గ్రామ టీడీపీ నాయకులు పెనుగంచిప్రోలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి రోజూ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కూర్చోబెట్టి నేతలపై పోస్టులు పెట్టవద్దని హెచ్చరిస్తున్నారు.తూర్పు గోదావరి జిల్లాలోని నర్సరీల్లో పనికి వచ్చే వలస కూలీలపై వరుస లైంగిక దాడులకు పాల్పతున్న వారిపై కేసులు లేవు... కానీ... విజయవాడలో వరద సాయంపై పోస్టు పెట్టిన వ్యక్తి కోసం అనేక ప్రాంతాల్లో గాలించి ఆఖరికి ఆలయానికి వెళుతుండగా పట్టుకున్నారు! అగ్గిపెట్టెలు.. కొవ్వొత్తులకు కోట్లు.. అంటేనే.. విజయవాడను వరద ముంచెత్తినప్పుడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు కోట్ల రూపాయలు ఖర్చుచేశారని పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం దమ్మాలపాడు గ్రామానికి చెందిన కల్లా నాగిరెడ్డి ‘ఎక్స్’లో పోస్టు చేశాడు. దీనిపై మార్కాపురానికి చెందిన కుంచాల యశ్వంత్ గత నెల 21వ తేదీన మార్కాపురం టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో నవంబర్ 5వ తేదీన ఉదయం తాడేపల్లిలోని అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళుతుండగా అయ్యప్పమాలలో ఉన్న నాగిరెడ్డిని అరెస్టు చేసి మార్కాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అర్ధరాత్రి సమయంలో 41 (ఏ) నోటీసు ఇచ్చి విడుదల చేశారు.మంగళగిరి నియోజకవర్గంలో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టి అర్ధనగ్నంగా లోకేశ్ ఫొటో ఎదుట మోకాళ్లపై కూర్బోబెట్టి క్షమాపణలు చెప్పిస్తే కేసు లేదు... టీడీపీ నాయకుల ఆగడాలు మితిమీరిపోయాయని ప్రజలు తీసి సోషల్ మీడియాలో పెట్టిన వీడియోను ఫార్వర్డ్ చేస్తే మాత్రం క్షణాల్లోనే అరెస్ట్... వీడియో ఫార్వర్డ్ చేసినందుకు... చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అనుచరుల ఆగడాలు పెరిగిపోయాయని, మద్యం దుకాణాల్లో వాటా అడుగుతూ వ్యాపారులపై దాడులు చేస్తున్నారని సోషల్ మీడియాలో వచ్చిన వీడియోను అక్టోబర్ 27వ తేదీన పాలేటి కృష్ణవేణి సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేశారు. ఆమెను ఈ నెల 2వ తేదీన గుంటూరు జిల్లా తాడేపల్లిలో అరెస్ట్ చేసి చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అదే రోజు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా బెయిల్ మంజూరు చేశారు. వందలాది గ్రామ, వార్డు సచివాలయాలను టీడీపీ మూకలు ధ్వంసం చేసినా ఒక్క కేసు లేదు... రూ.436 కోట్లతో రిషికొండలో అద్భుతమైన భవనం వైఎస్ జగన్ కట్టించారు.. ఐదేళ్లలో నోవాటెల్ హోటల్ అద్దె రూ. 300కోట్లు.. అని పోస్టు పెడితే వెంటనే పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధం.. రిషికొండలో అద్భుత భవనం అన్నందుకు..ఎన్టీఆర్ జిల్లా పరిటాల గ్రామానికి చెందిన జమలయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. ‘రూ.436 కోట్లతో రిషికొండలో అద్భుతమైన భవనం వైఎస్ జగన్మోహన్రెడ్డి కట్టించారు. ఐదేళ్లలో నోవాటెల్ హోటల్ అద్దె రూ. 300 కోట్లు. మీకు అర్థమైంది’ అని జమలయ్య ఫేస్బుక్లో పోస్టు పెట్టారు. దీంతో పోలీసులు అతన్ని స్టేషన్‌కు తీసుకువెళ్లి రెండు రోజులు ఉంచారు. జమలయ్య సెల్‌ఫోన్ స్వా«దీనం చేసుకుని నోటీసు ఇచ్చారు. తప్పుడు ప్రచారం నమ్మవద్దన్నందుకే... ఎన్టీఆర్ జిల్లా పెండ్యాల గ్రామానికి చెందిన షేక్ షబ్బీర్ తిరుమల లడ్డూ వివాదంలో చంద్రబాబు చేసిన అబద్ధపు ప్రచారాన్ని నమ్మవద్దని వాట్సాప్ గ్రూప్‌లో సమాచారం పెట్టాడు. ఈ విషయాన్ని జీరి్ణంచుకోలేని టీడీపీ మూకలు కేసు పెట్టటంతో షబ్బీర్‌ను రెండు రోజులపాటు పోలీస్‌స్టేషన్‌లో ఉంచి చితకబాదారు. సెల్‌ఫోన్ తీసుకున్నారు. అతనితోపాటు వాట్సాప్ గ్రూప్‌లో ఉన్న 170 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. జగన్‌ను పొగిడినందుకే నోటీసు ఎన్టీఆర్ జిల్లా పెండ్యాలకు చెందిన మహ్మద్ నసరత్ ఇటీవల ఓ వాట్సాప్ గ్రూపులో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని పొగుడుతూ పోస్టు పెట్టారు. దానిపై కూడా ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహ్మద్ నసరత్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు.ఐటీడీపీ కార్యకర్త ఫిర్యాదు చేస్తే చాలు... శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన బాలాజీరెడ్డి ఫేస్బుక్లో టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా పోస్టు పెడుతున్నాడని ఐటీడీపీకి చెందిన ఎ.పవన్‌కుమార్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ నెల 2వ తేదీన పోలీసులు అర్ధరాత్రి వేళ బాలాజీరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అదేరోజున రొద్దం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. విచారణ తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. అయితే.. ఈ నెల ఏడో తేదీన మరోసారి అదుపులోకి తీసుకున్నారు. వివిధ రకాలుగా ఇబ్బందులకు గురి చేసిన తర్వాత శనివారం విడిచిపెట్టారు. ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వరు.. కేసు వివరాలు చెప్పరు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామానికి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ షేక్ గౌస్ ఇటీవల ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టారని పోలీసులకు ఫిర్యాదు అందింది. వారం కిందట గౌస్‌ను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి ఫోన్ తీసుకుని నాలుగు రోజులు స్టేషన్ చుట్టూ తిప్పారు. కేసు నమోదు చేసి 41 నోటీసు ఇచ్చారు. కానీ ఎఫ్ఐఆర్ కాపీ, కేసు వివరాలు అడిగితే స్పందించలేదు. పది నెలల కిందట పోస్టు... ఇప్పుడు అరెస్టు ప్రకాశం జిల్లా సీఎస్ పురం మండలం అనిగాండ్లపల్లికి చెందిన హరీశ్వర్‌రెడ్డి ‘ఎక్స్’లో ఈ ఏడాది జనవరి 24న నాటి టీడీపీ మహిళా అధ్యక్షురాలు, ప్రస్తుతం హోంమంత్రి వంగలపూడి అనితను అసభ్య పదజాలంతో దూషించారని కోవూరుకు చెందిన టీడీపీ ఎస్సీ సెల్ నాయకుడు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హరీశ్వర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు కుటుంబంపై కూడా ‘ఎక్స్’లో హరీశ్వర్‌రెడ్డి అసభ్యంగా పోస్టింగ్ పెట్టారని నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని టీడీపీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 6వ తేదీన అరెస్ట్ చేశారు. స్టేషన్ బెయిల్‌పై వదిలి పెట్టారు. పొదిలిలో ఫిర్యాదు.. విశాఖలో అరెస్టు విశాఖట్నానికి చెందిన బోస రమణారెడ్డి.. ఎక్స్, ఇన్‌స్ట్రాగామ్‌లలో పోస్టులు పెట్టడం ద్వారా మంత్రి లోకేష్ గౌరవ మర్యాదలు తగ్గించే ప్రయత్నం చేసినట్లు పొదిలికి చెందిన టీడీపీ నాయకుడు గత నెల 21వ తేదీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసు విచారణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి విశాఖపట్నం వెళ్లి మరీ రమణారెడ్డిని ఈ నెల 6న అరెస్టు చేసి పొదిలికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి పొదిలి పోలీస్‌స్టేషన్‌లోనే ఉన్నట్లు సమాచారం.కందిపప్పు కిలోకి.. 780 గ్రాములే ఉందన్నందుకు.. ప్రభుత్వం ప్రజలకు పౌరసరఫరాల శాఖ కిలో పేరిట ఇస్తున్న కందిపప్పు 780 గ్రాములు మాత్రమే ఉండటంతో ఆ విషయాన్ని గత నెల 4వ తేదీన ఫేస్బుక్లో పెట్టిన అచ్చంపేట మండలానికి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ తుమ్మా బాబుల్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరైన బాబుల్ రెడ్డి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. రెండు, మూడు రోజులు తమకు అందుబాటులో ఉండాలని హెచ్చరించి పంపించారు. జోగి రమేష్ వీడియోను స్టేటస్‌గా పెట్టుకున్నందుకు.. మాజీ మంత్రి జోగి రమేష్ వీడియోను వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకున్నందుకు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన కె.నానిపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. జోగి రమేష్ గతంలో ఒక వేదికపై.. జనసేన నేత పవన్‌కళ్యాణ్‌ను ఎన్ని పార్టీలు మారుస్తావ్, ఎన్ని జెండాలు మారుస్తావని ప్రశ్నించారు. ఈ వీడియోని నాని తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టు చూసినందుకు సాక్ష్యం చెప్పాలని నోటీసులు తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా మెండోరా గ్రామానికి చెందిన బద్దం అశోకరెడ్డి నిర్వహించే ‘వైఎస్సార్ కుటుంబం’ అనే గ్రూప్‌లో ఉన్న చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గానికి చెందిన దిలీప్ రెడ్డి, చిట్టిబాబు, జిల్లేడయ్య, మోతీలాల్, సతీష్, అంగముత్తు, జలంధర్లను విజయవాడ సిటీ, సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌కు సాక్షులుగా రావాలని అండర్ 17 బీఎన్ఎస్ఎస్ కింద నోటీసులు అందించారు. వెంటనే రాకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంతకూ ఆ గ్రూపులో ఏ పోస్టు చూసినందుకు తమను రమ్మంటున్నారో చెప్పకుండానే నోటీసులివ్వడం పట్ల వారు లబోదిబోమంటున్నారు.సీఎం వ్యాఖ్యలను ఖండించారని...శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం బండగానిపల్లి గ్రామానికి చెందిన బేరి తిరుపతిరెడ్డి గత నెలలో తిరుపతి లడ్డూపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఫేస్బుక్లో పోస్టు పెట్టారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా, బెయిల్‌పై విడుదలయ్యారు. పోస్టులు ఫార్వర్డ్ చేశారనికావలి పట్టణంలోని 11 వార్డుకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులు ఆత్మకూరు రాజేష్, దామెర్ల శ్రావణ్ కుమార్‌లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులను వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేస్తున్నారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కావలి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. వ్యతిరేకత సహించలేక... నెల్లూరు జిల్లాకు చెందిన మద్దిబోయిన వీరరఘు, కుందర్తి శ్రీనివాసులు, మేకల శ్రీనివాసులు(బోగోలు), ఉప్పాల మాచర్ల(ఎస్జీవీ కండ్రిక), ఏకే సుందరరాజు(విశ్వనాథరావుపేట)లు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ప్రభుత్వ వైఫల్యాలపై మీడియాలో వచ్చిన కథనాలు, పోస్టులను ఫార్వర్డ్ చేస్తున్నారని కూటమి నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వీరిపై నెల్లూరు జిల్లాలో పోలీసులు కేసులు నమోదు చేశారు. తరచూ స్టేషన్లకు పిలిచి ఇబ్బంది పెడుతున్నారు. టీడీపీ నేత మందు పార్టీ ఫొటోలు ఫార్వర్డ్ చేశారని..నెల్లూరు జిల్లా దగదర్తిలో టీడీపీ నేత పమిడి రవికుమార్ చౌదరి తన స్నేహితులతో కలిసి వ్యవసాయ భూముల్లో ఉన్న గెస్ట్‌హౌస్‌లో మందుపార్టీ చేసుకున్నారు. ఆ ఫొటోలు ఒక సోషల్ మీడియా గ్రూపులో వచ్చాయి. ఆ ఫొటోలను సబ్బా ప్రభావతి ఇతరుల వాట్సాప్ గ్రూపుల్లోకి ఫార్వర్డ్ చేశారనే కారణంతో ఆమెపై కేసు నమోదు చేశారు.నోటీసు ఇవ్వకుండానే అరెస్టు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌పై అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ ఈ నెల 3వ తేదీన విశాఖకు చెందిన బోడి వెంకటేష్‌పై బాపట్ల జిల్లా మార్టూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నెల 5వ తేదీన మార్టూరు పోలీసులు విశాఖకు వచ్చారు. నోటీసు ఇవ్వకుండా వెంకటేష్‌ను దువ్వాడ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారించారు. అడిగిన తరువాత 41ఏ నోటీసు ఇచ్చి విడుదల చేశారు. ఈ నెల 8వ తేదీన మార్టూరు పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని చెప్పారు. ఇంతలో ఈ నెల 6వ తేదీన గాజువాకకు చెందిన టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు సాకెళ్ల రతన్‌కాంత్.. బోడి వెంకటేష్‌పై దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు 7వ తేదీన విచారణకు పిలిచి అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. కక్ష కట్టి... కేసు పెట్టి... ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణానికి చెందిన తమ్మవరపు మురళీకృష్ణ, ఎ.నరేంద్ర సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పోస్టులను సోషల్ మీడియాలో ఫార్వార్డ్ చేశారని వారం రోజుల క్రితం వీరిద్దరిపై జగ్గయ్యపేటలో కేసులు నమోదు చేశారు. వారి ఫోన్లను స్వా«దీనం చేసుకున్నారు. రోజూ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు.బూట్లు వేసుకుని సీఎం పూజలు చేయడం తప్పు అన్నందుకు... అనంతపురం జిల్లా శెట్టూరు మండలం యాటకల్లు గ్రామానికి చెందిన లక్ష్మణమూర్తి తిరుపతి లడ్డూ వివాదం సమయంలో ఒక వాట్సాప్ గ్రూప్‌లో ‘పూజా కార్యక్రమాలలో బూట్లు వేసుకుని పాల్గొనే తమరు కూడా హిందూ మతం గురించి మాట్లాడటానికి సిగ్గు ఉండాలి’ అంటూ సీఎం చంద్రబాబును ఉద్దేశించి పోస్టు చేశాడని సెపె్టంబర్ 26న టీడీపీ నాయకుడు కళ్యాణదుర్గం అర్బన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి లక్ష్మణమూర్తిని అరెస్టు చేశారు. విచారణ అనంతరం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బైండోవర్శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం కె.పూలకుంట గ్రామానికి చెందిన ఆంజనేయులు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నాడనే కారణంతో ఈ నెల 6వ తేదీన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక రోజు అక్రమంగా నిర్బంధించి మరుసటి రోజు బైండోవర్ చేశారు. ఎలాంటి కేసు నమోదు చేయలేదు. అరెస్టు చూపకుండా... ఆందోళనకు గురిచేసి..అనంతపురం జిల్లా మదిగుబ్బ గ్రామానికి చెందిన జింకల రామాంజినేయులు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పోస్టు చేశాడన్న అభియోగాలతో ఇటుకలపల్లి పోలీసులు ఈ నెల 5వ తేదీ అదుపులోకి తీసుకున్నారు. వెంటనే అరెస్టు చూపకుండా, కుటుంబ సభ్యులకు అతని ఆచూకీ తెలపకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. దీంతో కుటుంబ సభ్యులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి రామాంజినేయులు ఆచూకీ తెలపాలని కోరారు. న్యాయస్థానం సీరియస్ కావడంతో పోలీసులు ఎట్టకేలకు శుక్రవారం (ఈ నెల 8న) అనంతపురంలోని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇతనికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు.ఇంటూరిపై15 కేసులు?విశాఖపట్నం మధురవాడ పరిధిలోని ధర్మపురి కాలనీకి చెందిన ఇంటూరి రవికిరణ్ పొలిటికల్ పంచ్ వెబ్ చానెల్ నిర్వహిస్తున్నారు. ఎక్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో యాక్టివ్‌గా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ పోలీసులు కేసుల పేరుతో వేధిస్తున్నారు. ఆయనపై దువ్వాడ, గుంటూరు, విజయవాడ, మార్టూర్ పోలీస్స్టేషన్లలో ఒక్కో కేసు.. గుడివాడ పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు, రాజమండ్రిలోని ప్రకాష్‌నగర్‌లో పలు కేసులు నమోదు చేశారు. మొత్తంగా ఇతనిపై దాదాపు 15 కేసులు నమోదు చేశారు. తాజాగా రాజమండ్రిలోని ప్రకాష్‌నగర్ పోలీసులు రవికిరణ్‌ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.రెండేళ్ల క్రితం పోస్టులు పెట్టారని... వైఎస్సార్ జిల్లా వేముల మండలం కొండ్రెడ్డిపల్లెకు చెందిన వర్రా రవీందర్‌రెడ్డి రెండేళ్ల క్రితం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇతర నాయకులపై సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టింగులు పెట్టారని కడప తాలూకా పోలీసుస్టేషన్లో ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 4వ తేదీన కేసు నమోదు చేశారు. అదే రోజు రాత్రి కడప నుంచి పోలీసు బృందం కొండ్రెడ్డిపల్లెలోని వర్రా రవీందర్‌రెడ్డి ఇంటికి వెళ్లింది. ఆయనను 5వ తేదీ తెల్లవారుజామున కడప తాలూకా పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చారు. 41 నోటీసు ఇచ్చి జామీను ద్వారా పంపించారు. వర్రా రవీందర్‌రెడ్డి కుటుంబ సభ్యులను కూడా చింతకొమ్మదిన్నె పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చి వేధింపులకు గురిచేశారు. ఈ విషయం మీడియాలో రావడంతో రాత్రి 7 గంటలసమయంలో కుటుంబ సభ్యులకు 41ఏ నోటీసు ఇచ్చి పంపించారు. ఆ తర్వాత మళ్లీ రవీందర్‌రెడ్డిని ఈ నెల 8వ తేదీన మహబూబ్‌నగర్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఎట్టకేలకు అతడ్ని సోమవారం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.భార్యాభర్తలకు చిత్రహింసలు పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన పెద్దిరెడ్డి సుధారాణి భర్త వెంకటరెడ్డి కాంట్రాక్టర్. ప్రస్తుతం వీరు తెలంగాణలోని నల్లగొండ జిల్లా వెంకటరమణ కాలనీలో నివాసం ఉంటున్నారు. టీడీపీ, జనసేన నాయకులపై సుధారాణి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఈ నెల 4వ తేదీన ఆమెతోపాటు భర్త వెంకటరెడ్డిని కూడా సిరిసిల్లలోని జొన్నవాడ గ్రామంలో రాజరాజేశ్వరీదేవి దర్శనానికి వెళ్లగా, చిలకలూరిపేట సీఐ రమేష్, మరో ఏడుగురు సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వారిని వెంటనే చిలకలూరిపేట తీసుకువచ్చి అక్రమంగా నిర్బంధించి వేధించారు. ఆరో తేదీన వారిని అరెస్టు చేసినట్లు తెలియజేసి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. అయితే, ఆ వెంటనే ప్రకాశం జిల్లా ఒంగోలు వన్‌టౌన్ పోలీసులు సుధారాణి దంపతులను అదుపులోకి తీసుకుని ఒంగోలుకు తరలించారు. వైఎస్సార్సీపీ న్యాయవాదులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో నవంబరు 9న గుంటూరు కొత్తపేట పోలీసులు జనసేన కార్యకర్త ఫిర్యాదు మేరకు హడావుడిగా అరెస్టు చూపారు. అంతకు ముందు చిలకలూరిపేట నుంచి ఒంగోలు పోలీసు స్టేషన్‌కు తరలించి, అక్కడ కూడా మహిళ అని కూడా చూడకుండా చిత్రహింసలకు గురిచేశారని బాధితురాలు న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు.ప్రజల దృష్టి మళ్లించేందుకే ‘సోషల్’ కుట్రవరుస హత్యలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలతో రాష్ట్రం అట్టుడుకుతుండటం ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే రికార్డు స్థాయిలో హత్యలు, అత్యాచారాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వరుస దాడులు, దౌర్జన్యాలతో యథేచ్ఛగా విధ్వంసకాండ కొనసాగుతోంది. తమకు ఓటేయలేదన్న కారణంతో టీడీపీ గూండాలు కర్రలు, కత్తులు చేత పట్టుకుని స్వైర విహారం చేస్తున్నారు. ఫలితంగా నాలుగు నెలల్లోనే రాష్ట్రంలో 179 మంది హత్యకు గురయ్యారు. మరో నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. సుమారు 500 మందిపై హత్యాయత్నాలకు తెగబడ్డారు. ఏకంగా 100 మందిపై అత్యాచారాలు, లైంగిక దాడులు జరిగాయి. వారిలో 11 మందిపై అత్యాచారం చేసి హత్య చేయడం దిగ్భ్రాంతి పరుస్తోంది. 2 వేలకు పైగా దాడులు, దౌర్జన్యాలతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. టీడీపీ గూండాల దాడులతో భీతిల్లి దాదాపు 3 వేల కుటుంబాలు గ్రామాలు విడిచిపెట్టి ఇతర ప్రాంతాల్లో తల దాచుకుంటున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. బాధితులపైనే ఎదురు కేసులు పెడుతున్నారు. హత్యలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు శాఖకు స్పష్టమైన మార్గ నిర్దేశం చేయలేదు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఇసుమంతైనా స్పందించక పోవడం పట్ల ప్రజల్లో తీవ్ర నిరసన వెల్లువెత్తుతోంది. ఈ నిరసన మరింత ఉధృతంగా మారనుందని తెలుసుకున్న సీఎం చంద్రబాబు ఎప్పటిలాగే డైవర్షన్ రాజకీయాలకు తెర లేపారు. ప్రభుత్వ తీరు పట్ల నిరసన తెలుపుతున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు పెట్టిస్తూ తనదైన శైలిలో ప్రజల దృష్టి మళ్లించేందుకు పూనుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. -
రూ.కోట్ల విలువైన బంగారం పట్టివేత
కావలి/వెంకటాచలం: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పోలీసులు ఎటువంటి బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని పట్టుకున్నారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే... కావలి సమీపంలోని గౌరవరం టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం వేకువజామున మూడు గంటల సమయంలో కావలి రూరల్ సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. చెన్నై నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు అనుమానాస్పదంగా కనిపించడంతో సోదాలు నిర్వహించారు. సీట్ల కింద ఎవరికి అనుమానం రాకుండా ఏర్పాటు చేసిన సీక్రెట్ లాకర్లలో పెట్టి తరలిస్తున్న సుమారు రూ.2.10 కోట్ల విలువైన 2.94 కేజీల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. బంగారం తరలిస్తున్న చెన్నైకి చెందిన మార్వాడీ వ్యాపారులు ఆశిష్ కుమార్, కమలేష్‌లను ప్రశ్నించగా బంగారానికి సంబంధించి ఎటువంటి పత్రాలు చూపించకపోవడంతో పోలీసులు విచారణ చేపట్టారు.మరో కారులో చెన్నై నుంచి తెనాలి తరలిస్తుండగా..వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద 1.5 కిలోల బంగారాన్ని పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. టోల్‌ప్లాజా వద్ద ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో చెన్నైకి చెందిన రాకేష్‌కుమార్ జైన్, లతాజైన్ దంపతులు చెన్నై వైపు నుంచి తెనాలికి టీఎన్ 01 బీఎస్3092 నంబరు కారులో వెళ్తుండగా పోలీసులు తనిఖీ చేశారు. కారులో 1.5 కిలోల బంగారాన్ని గుర్తించారు. బంగారానికి సంబంధించి ఎలాంటి బిల్లులు చూపకపోవడంతో బంగారాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
Motor Accident Claims: ఆ కేసులను వేగంగా పరిష్కరించండి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: మోటార్ వాహనాల ప్రమాదాల క్లెయిమ్ కేసులను వేగంగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇందుకోసం మూడు నెలల్లోగా పోలీసు స్టేషన్లలో ప్రత్యేక యూనిట్లను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. రోడ్డు ప్రమాద క్లెయిముకు సంబంధించిన ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఏ నజీర్, జేకే మహేశ్వరితో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు పేర్కొంది. ‘‘రోడ్డు ప్రమాదంపై ఫిర్యాదు అందగానే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. దర్యాప్తు అధికారి మోటారు వాహనాలు(సవరణ) నిబంధనలు–2022 ప్రకారం నడుచుకోవాలి. ఫస్ట్ యాక్సిడెంట్ రిపోర్టును 48 గంటల్లోగా క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌కు సమర్పించాలి’’ అని పేర్కొంది. -
నలుగురు సినీ ప్రేక్షకులపై కేసు
బెంగళూరు: సినిమాహాల్లో జాతీయగీతం ప్రదర్శించినప్పుడు కుర్చీల్లోంచి లేచి నిలబడలేదన్న కారణంతో నలుగురిపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పదిహేను రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్టోబరు 23న బెంగళూరులోని పీవీఆర్ ఓరియన్ సినిమాహాల్లో ప్రదర్శితమవుతోన్న తమిళ సినిమా ‘అసురన్’కు వచ్చిన ప్రేక్షకుల్లో నలుగురు సినిమాకు ముందుగా జాతీయగీతం ‘జనగణమన’ను ప్రదర్శించినప్పుడు లేచి నిలబడలేదు. దీంతో ఓ వ్యక్తి వారిని వీడియో తీశాడు. ఈ వీడియోను సినీ నటి బీవీ ఐశ్వర్య సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. దీని ఆధారంగా పోలీసులు ఆ నలుగురు వ్యక్తులపై సుమోటోగా కేసు నమోదు చేశారు. అయితే, వారి పేర్లను అందులో పేర్కొనలేదు. -
బాలికపై స్నేహితుల అత్యాచారం
థానే: స్నేహితుల దినోత్సవం పేరు చెప్పి ఓ బాలికను పార్టీకి ఆహ్వానించిన ఇద్దరు స్నేహితులు..ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని థానేలో జరిగింది. స్నేహితుల రోజు వేడుకను చేసుకుందాం రమ్మని ఆదివారం సాయంత్రం బాలిక(16) వద్దకు ఆమె ఇద్దరు స్నేహితులు వచ్చారు. తెలిసినవారు కావటంతో ఆమె వారి వెంట వెళ్లింది. తర్వాత నిందితులిద్దరూ బాలికను బైక్ డోమ్బివ్లీలోని ఓ పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లి రేప్ చేశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించిన నిందితులు..ఆమెను ఇంటి వద్ద దింపారు. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరు విద్యార్థి కాగా, మరొకరు చేపల వ్యాపారం చేస్తున్నాడు. -
వేబ్రిడ్జి మోసాలపై తూనికలశాఖ కొరడా!
సాక్షి, హైదరాబాద్: వేబ్రిడ్జిల్లో మోసాలపై తూనికలు కొలతలశాఖ కొరడా ఝళిపించింది. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా తూనికల కొలతలశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ‘వేబ్రిడ్జిలో తూకం తగ్గుతోంది’ అని ఈ నెల 18న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. తూకంలో మోసం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న 35 వేబ్రిడ్జిలపై తూనికలు, కొలతల శాఖ అధికారులు కేసు నమోదు చేసి సీజ్ చేశారు. రీజినల్ డిప్యూటీ కంట్రోలర్ శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ కంట్రోలర్ జగన్మోహన్ నేతృత్వంలో తనిఖీలు జరిగాయి. రంగారెడ్డి జిల్లాలో ఆటోనగర్‌లోని పంతంగి వేబ్రిడ్జి, సాగర్ రింగ్‌రోడ్డులోని జై హనుమాన్ వే బ్రిడ్జి, కర్మన్‌ఘాట్‌లోని ఫైసల్ వేబ్రిడ్జి, శంషాబాద్‌లోని రామధర్మకాంట, గోల్డెన్ వేబ్రిడ్జిల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని గుర్తించారు. జై హనుమాన్ వేబ్రిడ్జి వద్ద తనిఖీలో యజమాని, కంప్యూటర్ ఆపరేటర్, లారీ డ్రైవర్లు కుమ్మకైన విషయం వెలుగు లోకి రావడంతో అధికారులు నివ్వెరపోయారు. దీనిపై వారు మరింత లోతుగా తనిఖీలు చేశారు. కంప్యూటర్లో ఎంత బరువు నమోదు చేస్తే అంతే వేబ్రిడ్జి తూకం చూపించేట్టుగా చేయడాన్ని అధికారులు గుర్తించారు. -
యురిదాడిపై ఎన్ఐఏ విచారణ
న్యూఢిల్లీ: యురిలో సైనిక స్థావరంపై ఉగ్రవాదదాడి ఘటనపై విచారణ చేయడానికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. ఈ దాడి ఘటనపై ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. ఎన్ఐఏ బృందం ఆధారాలు సేకరించడానికి త్వరలో యురికి వెళ్లనుంది. భద్రత దళాల కాల్పుల్లో హతమైన జైషే మహ్మద్ గ్రూపునకు చెందిన నలుగురు ఉగ్రవాదుల నుంచి డీఎన్ఏ నమూనాలను సేకరించనుంది. జమ్ము కశ్మీర్లో యూరి సైనిక స్థావరంపై ఉగ్రవాదులు చేసిన దాడిలో 20 మంది జవాన్లు వీరమరణం పొందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. భద్రత దళాలు నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఈ దాడి వెనుక పాకిస్థాన్‌కు సంబంధముందని ఆధారాలు లభించాయి. -
ఏ ఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యా యత్నం
పులివెందుల : కుటుంబ కలహాలతో ఏఆర్ కానిస్టేబుల్ పవన్‌కుమార్(29) ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కడపకు చెందిన ఆయన 2009 నుంచి ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి లింగాల మండలం గుణకణపల్లెకు చెందిన ఫ్యాక్షన్ నాయకుడు కష్ణారెడ్డికి గన్‌మెన్‌గా ప్రభుత్వం పవన్‌కుమార్‌ను నియమించింది. అప్పటి నుంచి పని చేస్తున్న ఆయన కుటుంబ కలహాలతో కలత చెంది ఆదివారం సాయంత్రం రెండు సీసాల దగ్గు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడిని 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స నిర్వహించి, ఎలాంటి ప్రమాదం లేదన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
యువకుడిపై హత్యాయత్నం
కడప అర్బన్ : కడప నగరం భగత్‌సింగ్‌నగర్ రోడ్డుపై శనివారం రాత్రి జావిద్ అనే యువకుడిపై జఫ్రుల్లా,అతని మామ పీరాన్, ఖాదర్, మరొకరు బ్లేడుతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. జఫ్రుల్లా, జావిద్‌కు మధ్య ఉన్న మనస్పర్థల కారణంగానే ఈ సంఘటన జరిగిందని తెలుస్తోంది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా ఎస్ఐ రాజరాజేశ్వరరెడ్డి తెలిపారు. -
ఎల్టీసీ కుంభకోణంలో ఎంపీలపై కేసు నమోదు
-
ఎల్టీసీ కుంభకోణంలో ఎంపీలపై కేసు నమోదు
న్యూఢిల్లీ : నకిలీ టిక్కెట్లు దాఖలు చేసి ప్రభుత్వం నుంచి భారీగా ప్రయాణ ఖర్చులు(ఎల్టీసీ)రాబట్టిన కేసులో ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, ముగ్గురు మాజీ ఎంపీలపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఢిల్లీతో పాటు ఒడిశాలోని ఎంపీల నివాసాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ కుంభకోణనికి సంబంధించి ఎంపీలపై చీటింగ్, ఫోర్జరీ కేసులు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదైనవారిలో లాల్‌మింగ్ లియానా(ఎంఎన్ఎఫ్), బందోపాధ్యాయ(టీఎంసీ), బీఎస్పీకి చెందిన బ్రజేష్ పాఠక్ ...మరో ముగ్గురు మాజీ ఎంపీలు జేపీఎన్ సింగ్(బీజేపీ), మహమూద్ ఎ.మదాని(ఆర్ఎల్డీ), బీజేడీకి చెందిన రేణుబల ప్రధాన్ ఉన్నారు. అలాగే పలు ట్రావెల్ ఏజెన్సీలపై కూడా సీబీఐ అధికారులు సోదాలు జరుపుతున్నారు. కాగా గత మార్చి నెలలో ఓ వ్యక్తి 600 ఖాళీ బోర్డింగ్ పాసులతో కోల్‌కతాలో దొరికిపోవడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.