15 ఆటోలు సీజ్‌ | 15 Autos Were Seized | Sakshi
Sakshi News home page

15 ఆటోలు సీజ్‌

Apr 8 2018 10:55 AM | Updated on Apr 8 2018 10:55 AM

15 Autos Were Seized - Sakshi

రెంజల్‌(బోధన్‌) : మోటారు వాహణ చట్టానికి విరుద్ధంగా నడుపుతున్న 15 ఆటోలను సీజ్‌ చేసినట్లు బోధన్‌ ఆర్‌టీవో రాజు తెలిపారు. శనివారం మండలంలోని సాటాపూర్‌లో జరిగిన వారాంతపు సంతకు ప్రయాణికులను తరలిస్తున్న ఆటోలను ఆయన తనిఖీ చేశారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా, పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న వాటిని పట్టుకుని సీజ్‌ చేశారు. ఇటీవల మెండారాలో జరిగిన సంఘటన దృష్ట్యా జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రతి వారం మూడు రోజులపాటు ప్రత్యేక స్పెషల్‌డ్రైవ్‌లను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఫిట్‌నెస్‌లేని ఆటోలను గుర్తించి సీజ్‌ చేస్తామన్నారు. సాటాపూర్‌ చౌరస్తాలో పలువురు ఆటోడ్రైవర్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement