13 వేల ఫోన్లకు ఒకే ఐఎమ్‌ఈఐ నెంబర్‌

13 Thousand Phones Working On Same IMEI In UP - Sakshi

మీరట్‌ : 13,500 మొబైల్‌ ఫోన్లు ఒకే ఐఎమ్‌ఈఐ నెంబర్‌(ఇంటర్‌ నేషనల్‌ మొబైల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ) కలిగి ఉన్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మీరట్‌కు చెందిన ఓ పోలీసు అధికారి సెల్‌ఫోన్‌ కొద్దిరోజుల క్రితం పాడైంది. అయన దాన్ని రిపేరు చేయించారు. అయిన‍ప్పటికి అది సరిగా పనిచేయలేదు. దీంతో దాన్ని సైబర్‌ క్రైం విభాగానికి చెందిన ఓ సిబ్బందికి అప్పగించి, సమస్య ఎంటో చూడమన్నారు. ఈ నేపథ్యంలో ఐఎమ్‌ఈఐల విషయం వెలుగులోకి వచ్చింది. ( కొడుకు కళ్లెదుటే.. భర్త దారుణం )

దీంతో సదరు మొబైల్‌ కంపెనీ, సర్వీస్‌ సెంటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మీరట్‌ ఎస్పీ అఖిలేష్‌ ఎన్‌. సింగ్‌ మాట్లాడుతూ.. ‘‘  దాదాపు 13,500 ఫోన్లు ఒకే ఐఎమ్‌ఈఐ నెంబర్‌పై పనిచేస్తున్నాయి. ఇది భద్రతకు సంబంధించిన సీరియస్‌ సమస్య. మొబైల్‌ కంపెనీ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. నేరస్తులు వారి స్వలాభానికి దాన్ని వాడుకునే అవకాశం ఉంది’’ అని అన్నారు. ( మేనకా గాంధీపై కేసు నమోదు )

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top