కొడుకు కళ్లెదుటే.. భర్త దారుణం | Kerala Woman Molested By Husband In Front of Son | Sakshi
Sakshi News home page

కేరళలో దారుణం.. స్నేహితులతో కలిసి భర్త అరాచకం

Jun 5 2020 4:10 PM | Updated on Jun 5 2020 4:17 PM

Kerala Woman Molested By Husband In Front of Son - Sakshi

తిరువనంతపురం: కేరళలో దారుణం చోటు చేసుకుంది. కన్న బిడ్డ ఎదురుగానే ఓ మృగాడు, స్నేహితులతో కలిసి భార్యపై అత్యాచారానికి  పాల్పడ్డాడు. ఈ దారుణానికి పాల్పడిన వారిని పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. వివరాలు.. గురువారం నిందుతుడు తన భార్య, ఇద్దరు పిల్లలను తీసుకుని సమీప బీచ్‌కు వెళ్లాడు. అనంతరం పక్కనే ఉన్న స్నేహితుడి ఇంటికి వారిని తీసుకుని వెళ్లాడు. అక్కడ బాధితురాలి చేత బలవంతంగా మద్యం తాగించి.. స్నేహితులతో కలిసి.. కొడుకు ఎదుటే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గాయాలతో, స్పృహలేని స్థితిలో రోడ్డు మీద ఉన్న బాధితురాలిని ఓ యువకుడు గమనించి ఇంటికి చేర్చాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ‘బాధితురాలు చెప్పిన వివరాలు నమోదు చేసుకున్నాం. త్వరలోనే నిందితులను పట్టుకుంటాము’ అని తెలిపారు. పిల్లలను నిందితులు కొట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలికి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కేరళ రాష్ట్ర మహిళా కమిషన్ ఈ కేసును స్వయంగా పరిశీలిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement