హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం | 1 Died In Hyderabad Road Accident At Hitec City | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Nov 25 2019 1:03 PM | Updated on Nov 25 2019 1:40 PM

1 Died In Hyderabad Road Accident At Hitec City - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని హైటెక్‌ సిటీ వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నోవాటెల్ వద్ద కారు- బైక్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా.. మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు..  మాదాపూర్‌ సమీపంలో అతివేగంగా దూసుకువస్తున్న బీఎండబ్ల్యూ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బుల్లెట్‌ బైక్‌ను ఢీకొంది.. ఈ ఘటనలో అభిషేక్‌ ఆనంద్‌(26) అక్కడికక్కడే మృతి చెందగా మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళను వైద్యం కోసం ఆసుపత్రికి తరలించి.. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కె. అశ్విన్‌ గా గుర్తించిన పోలీసులు డ్రైవర్‌ మద్యం సేవించి, తప్పు మార్గంలో నడపుతుండటం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. ప్రమాదంలో రెండు వాహనాలు సైతం పూర్తిగా దెబ్బతిన్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement