ప్రపంచంలోనే రెండో స్థానంలో ఫోన్‌ పే

Phone Pay is a Second Highest Downloaded App in Month of May - Sakshi

సాక్షి: ఆన్‌లైన్‌ నగదు చెల్లింపు సేవల సంస్థ ఫోన్‌ పే మే నెలలో4.70 మిలియన్స్‌ డౌన్‌లోడ్స్‌తో రెండో స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోల్చితే కంపెనీ 27 శాతం వృద్ధి నమోదు చేసింది. 9 మిలియన్ల డౌన్‌లోడ్స్‌తో  గూగుల్‌ పే(తేజ్‌) మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో పే పాల్‌, క్యాష్‌ యాప్‌, యూనియన్‌ పే ఉన్నాయని అనలిస్టు జూలియా చాన్‌ తెలిపారు. ఫోన్‌ పే, గూగుల్‌ పే రెండూ కూడా ఇప్పటి వరకు గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి పది కోట్ల డౌన్‌లోడ్‌లు సాధించాయి. కాగా గూగుల్‌ పే యాప్‌ను 99.40 శాతం ఇండియాలోనే డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. పైన తెలిపిన 9 మిలియన్లలో అయితే 99.90 శాతం డౌన్‌లోడ్‌లు ఇండియాలోనే జరిగాయి.   

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top