UPI Down: ఫోన్‌పే, గూగుల్‌ పే యూజర్లకు షాక్‌.. యూపీఐ సేవల్లో అంతరాయం | UPI Down For Several Users Across India | Sakshi
Sakshi News home page

UPI Down: ఫోన్‌పే, గూగుల్‌ పే యూజర్లకు షాక్‌.. యూపీఐ సేవల్లో అంతరాయం

Mar 26 2025 8:08 PM | Updated on Mar 26 2025 8:29 PM

UPI Down For Several Users Across India

యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవలకు దేశవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. చాలామంది వినియోగదారులు లావాదేవీలను చేయలేకపోయినట్లు వెల్లడించారు. బుధవారం రాత్రి 7:50 గంటలకు 2,750 యూపీఐ లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. గూగుల్‌పే వినియోగదారుల నుంచి 296 ఫిర్యాదులు వచ్చాయి.

యూపీఐ సేవలు డౌన్ అవ్వడంతో.. దేశ వ్యాప్తంగా వినియోగదారులు లావాదేవీలు చేయడంలో అంతరాయాన్ని ఎదుర్కొంటున్నారు. వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా.. వారు ఎదుర్కొన్న సమస్యలను పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ సమస్య కారణం ఏమిటనేది తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement