ఫోన్‌పే ఐపీవో సన్నాహాలు షురూ  | PhonePe May Raise 1. 5 Billion dollers in IPO | Sakshi
Sakshi News home page

ఫోన్‌పే ఐపీవో సన్నాహాలు షురూ 

Jun 24 2025 5:33 AM | Updated on Jun 24 2025 9:42 AM

PhonePe May Raise 1. 5 Billion dollers in IPO

మర్చంట్‌ బ్యాంకర్ల నియామకం 

న్యూఢిల్లీ: గ్లోబల్‌ రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ గ్రూప్‌ ఫిన్‌టెక్‌ కంపెనీ ఫోనేపే పబ్లిక్‌ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా మర్చంట్‌ బ్యాంకర్లను ఎంపిక చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఐపీవో నిర్వహణకు కొటక్‌ మహీంద్రా క్యాపిటల్, జేపీ మోర్గాన్‌ చేజ్, సిటీగ్రూప్, మోర్గాన్‌ స్టాన్లీలను నియమించుకున్నట్లు పేర్కొన్నాయి. కాగా.. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజాలు జనరల్‌ అట్లాంటిక్, వాల్‌మార్ట్, రిబ్బిట్‌ క్యాపిటల్, టీవీఎస్‌ క్యాపిటల్‌ ఫండ్స్, టైగర్‌ గ్లోబల్‌ నుంచి ఫోన్‌పే 85 కోట్ల డాలర్లు(రూ. 7,021 కోట్లు) సమీకరించింది.

 12 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. లక్ష కోట్లు) విలువలో ఈ పెట్టుబడులు సమకూర్చుకోవడం గమనార్హం! అంతక్రితం 2022లో సింగపూర్‌ నుంచి భారత్‌కు బదిలీకావడానికి వీలుగా దేశీ ప్రభుత్వానికి పన్నుల రూపేణా ఫోన్‌పే బిలియన్‌ డాలర్లు(రూ. 8,000 కోట్లు) చెల్లించిన సంగతి తెలిసిందే. 2016లో ఏర్పాటైన కంపెనీ ఇప్పటివరకూ రూ. 18,000 కోట్ల పెట్టుబడులు సమకూర్చుకుంది. 2023–24లో ఆదా యం 74 శాతం జంప్‌చేసి రూ. 5,064 కోట్లను తాకింది. ఇసాప్‌ వ్యయాలను మినహాయిస్తే రూ. 197 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2022–23) రూ. 738 కోట్ల నష్టం ప్రకటించింది. 

Advertisement
 
Advertisement
Advertisement