బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త ఆఫర్స్‌ | BSNL Announces New offers | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త ఆఫర్స్‌

Feb 20 2018 10:12 AM | Updated on Feb 20 2018 10:12 AM

BSNL Announces New offers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వినియోగదారుల సౌకర్యార్థం బీఎస్‌ఎన్‌ఎల్‌ పలు ఆఫర్లు ప్రకటించింది. ఇందులో ఎస్‌టీవీ-99, ఎస్‌టీవీ-319, ప్లాన్‌-999, ప్లాన్‌-949, డేటా ఎస్‌టీవీ-7 ప్లాన్లు ఉన్నాయి. ఎస్‌టీవీ-319, 99 ప్లాన్లు ఇవాళ్టి (మంగళవారం) నుంచి  అందుబాటుకి వస్తాయి. ప్లాన్‌ 999, 949లు ఈ నెల 15 నుంచి, డేటా ఎస్‌టీవీ-7 ప్లాన్‌ ఈ నెల 17 నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. వీటితో పాటు ఎస్‌టీవీ-26, ట్రిపుల్‌ ఏస్‌-333, బీఎస్‌ఎన్‌ఎల్‌ చౌక-444, ఇంటర్నేషనల్‌ వైఫై ప్లాన్‌లు కూడా అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది. ప్రీపెయిడ్‌ కస్టమర్లకు ఈ నెల 10 నుంచి యూఏఈ, యూఎస్‌ఏలకు ఇంటర్నేషనల్‌ రోమింగ్‌ సౌకర్యాన్ని సైతం కల్పించినట్లు పేర్కొంది. ఈ నెల 19 (సోమవారం) నుంచి 28 వరకు సంస్థ స్టోర్లలో మెగా సిమ్‌ మేళాలు నిర్వహిస్తామని వెల్లడించింది. ఉచితంగా 3జీ సిమ్‌లను అందజేయడంతో పాటు ప్రతి రూ.110 రీచార్జ్‌తో ఫుల్‌ టాక్‌టైమ్‌ ఇవ్వనున్నట్లు తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement