రూ.4,999కే 4జీ స్మార్ట్‌ఫోన్‌ | ZTE Blade Qlux 4G Launched, Becomes Cheapest 4G Phone | Sakshi
Sakshi News home page

రూ.4,999కే 4జీ స్మార్ట్‌ఫోన్‌

Jun 12 2015 4:34 PM | Updated on Apr 3 2019 3:50 PM

రూ.4,999కే 4జీ స్మార్ట్‌ఫోన్‌ - Sakshi

రూ.4,999కే 4జీ స్మార్ట్‌ఫోన్‌

మొబైల్ ఫోన్ల తయారీలో ఉన్న జెడ్‌టీఈ రూ.4,999లకే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించింది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీలో ఉన్న జెడ్‌టీఈ రూ.4,999లకే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించింది. బ్లేడ్ క్యూలక్స్ పేరుతో తయారైన ఈ మోడల్ భారత్‌లో చవకైన 4జీ స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ దక్షిణాసియా టెర్మినల్ సేల్స్ సీఈవో యువాన్ కాంగ్ తెలిపారు. డేటా స్పీడ్ 150 ఎంబీపీఎస్ వరకు ఉంటుందని చెప్పారు. ఈ ఫోన్ జూన్ 16 నుంచి ప్రత్యేకంగా అమెజాన్‌లో లభిస్తుంది.

4.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, 1.3 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, ఆటోఫోకస్ లెడ్ ఫ్లాష్‌తో 8 ఎంపీ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 2,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, 32 జీబీ ఎక్స్‌టర్నల్ మెమరీ, డ్యూయల్ సిమ్ వంటి ఫీచర్లున్నాయి. ఆన్‌డ్రాయిడ్ 4.4 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. వర్షన్ 5కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్ నుంచి డబుల్ డేటా ఆఫర్ కూడా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement