యాహూలో భారీగా ఉద్యోగాల కోత? | yahoo to lay off jobs at bangalore office | Sakshi
Sakshi News home page

యాహూలో భారీగా ఉద్యోగాల కోత?

Oct 8 2014 11:21 AM | Updated on Sep 2 2017 2:32 PM

యాహూలో భారీగా ఉద్యోగాల కోత?

యాహూలో భారీగా ఉద్యోగాల కోత?

ప్రముఖ సెర్చింజన్, మెయిల్ ప్రొవైడర్ సంస్థ యాహూ భారతదేశంలో భారీగా ఉద్యోగాలకు కోత పెడుతున్నట్లు సమాచారం.

ప్రముఖ సెర్చింజన్, మెయిల్ ప్రొవైడర్ సంస్థ యాహూ భారతదేశంలో భారీగా ఉద్యోగాలకు కోత పెడుతున్నట్లు సమాచారం. బెంగళూరు కార్యాలయాన్ని తాము పునర్నిర్మిస్తున్నట్లు చెబుతున్నా, ఎక్కడా ఉద్యోగాల కోత విషయాన్ని మాత్రం వాళ్లు అధికారికంగా నిర్ధారించడం లేదు. కానీ ఇంతకుముందు ఒకసారి ఇలాగే 2000 మంది ఉద్యోగులను తొలగించి.. దాదాపు 375 మిలియన్ డాలర్ల సొమ్మును ఆదా చేసుకుంది.

యాహూ నిరంతర ప్రగతి సాధిస్తూనే ఉందని, మరింత సామర్థ్యాన్ని సాధించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని యాహూ ఇండియా కార్పొరేట్ కమ్యూనికేషన్స్ మేనేజర్, లీడ్ ప్రచి సింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. బెంగళూరు కార్యాలయాన్ని తాము పూర్తిగా పునర్వ్యవస్థీకరిస్తున్నామని, భారతదేశంలోను.. బెంగళూరులో కూడా తాము తమ ఉనికిని బాగానే చాటుకుంటామని ఆమె అన్నారు. అయితే అనధికారిక కథనాల ప్రకారం ఈసారి కూడా దాదాపు రెండు వేల మందికి యాహూ పింక్ స్లిప్పులు ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement