డిజిటల్ మ్యాగజైన్లను నిలిపివేస్తున్న యాహూ | Yahoo begins shuttering some digital services | Sakshi
Sakshi News home page

డిజిటల్ మ్యాగజైన్లను నిలిపివేస్తున్న యాహూ

Feb 19 2016 1:22 AM | Updated on Sep 3 2017 5:54 PM

డిజిటల్ మ్యాగజైన్లను నిలిపివేస్తున్న యాహూ

డిజిటల్ మ్యాగజైన్లను నిలిపివేస్తున్న యాహూ

ప్రత్యర్థి కంపెనీల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న ఇంటర్నెట్ సంస్థ యాహూ.. వ్యాపార పునర్‌వ్యవస్థీకరణపై మరింతగా కసరత్తు చేస్తోంది.

శాన్‌ఫ్రాన్సిస్కో: ప్రత్యర్థి కంపెనీల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న ఇంటర్నెట్ సంస్థ యాహూ.. వ్యాపార పునర్‌వ్యవస్థీకరణపై మరిం తగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కొన్ని డిజిటల్ మ్యాగజైన్స్‌ను నిలిపివేయడం మొదలుపెట్టింది. యాహూ ఫుడ్, హెల్త్, పేరెంటింగ్, మేకర్స్, ట్రావెల్, ఆటోస్, రియల్ ఎస్టేట్ మ్యాగజైన్లను దశలవారీగా మూసివేయనున్నట్లు సంస్థ గ్లోబల్ ఎడిటర్ ఇన్ చీఫ్ మార్తా నెల్సన్ తమ బ్లాగ్‌లో వెల్లడించారు. యాహూను వృద్ధి బాట పట్టించే దిశగా ఉత్పత్తులు, వనరులపరంగా మరింత సాహసోపేత ప్రణాళికను అమలు చేయాల్సి ఉంటుందని కంపెనీ సీఈవో మరిస్సా మెయర్ ఇటీవలే పేర్కొన్నారు. దీని ప్రకారం దాదాపు 1,500 ఉద్యోగాల్లో కంపెనీ కోత విధించనుంది. దుబాయ్, మెక్సికో సిటీ, బ్యూనస్ ఎయిర్స్, మ్యాడ్రిడ్, మిలాన్ తదితర ప్రాంతాల్లో కార్యాలయాలను మూసివేయనుంది.

Advertisement
 
Advertisement
Advertisement