తెలంగాణ సర్కార్‌ కీలక ఉత్తర్వులు | Telangana: Reorganization Of Committees For Epc Works | Sakshi
Sakshi News home page

తెలంగాణ సర్కార్‌ కీలక ఉత్తర్వులు

Jun 11 2026 3:51 PM | Updated on Jun 11 2026 4:00 PM

Telangana: Reorganization Of Committees For Epc Works

సాక్షి, హైదరాబాద్‌: ఎంఎంసీ, సీఎంసీలో రూ.10 కోట్లకు పైబడిన ఈపీసీ పనుల కోసం కమిటీల పునర్వ్యవస్థీకరణకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు కొత్త కమిటీలను నియమించింది. టెక్నికల్ బిడ్ల పరిశీలనకు కమిటీ-2కి అధికారాలు ఇచ్చింది. టెండర్ల ఆమోద ప్రక్రియకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. రూ.10 కోట్లకు మించిన పనులపై పర్యవేక్షణ చేయనుంది.

పనుల స్కోప్, డెలివరబుల్స్, బెంచ్‌మార్క్‌ల పరిశీలనకు కమిటీ-1, ధర బిడ్ల ఓపెనింగ్, టెండర్ ఆమోదాలకు కమిటీ-2, అదనపు పనులు, గడువు పొడిగింపుల ఆమోదానికి కమిటీ-3 ఏర్పాటు చేసింది. ఇంజినీర్-ఇన్-చీఫ్ (పబ్లిక్ హెల్త్)కు కీలక బాధ్యతలు అప్పగించింది. హెచ్‌ఎండబ్ల్యూఎస్‌,ఎస్‌బీ, హెచ్‌ఎండీఏ, ఆర్థిక శాఖ ప్రతినిధులను కమిటీల్లో ప్రభుత్వం స్థానం కల్పించింది. ఎంఎంసీ, సీఎంసీ కమిషనర్లు తదుపరి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement