షావోమి ‘రెడ్‌మి–4’@ రూ.6,999 | Xiaomi launches Redmi 4 in India | Sakshi
Sakshi News home page

షావోమి ‘రెడ్‌మి–4’@ రూ.6,999

May 17 2017 12:41 AM | Updated on Nov 6 2018 5:26 PM

షావోమి ‘రెడ్‌మి–4’@ రూ.6,999 - Sakshi

షావోమి ‘రెడ్‌మి–4’@ రూ.6,999

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘షావోమి’ తాజాగా ‘రెడ్‌మి–4’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.

హైదరాబాద్‌లో ‘మి హోమ్‌’ స్టోర్‌!
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘షావోమి’ తాజాగా ‘రెడ్‌మి–4’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.6,999. ఇందులో 5 అంగుళాల స్క్రీన్, ఆక్టాకోర్‌ ప్రాసెసర్, 13 ఎంపీ రియర్‌ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 4,100 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ వివరించింది. ‘రెడ్‌మి–4’ స్మార్ట్‌ఫోన్‌ 2 జీబీ ర్యామ్‌/16 జీబీ మెమరీ, 3 జీబీ ర్యామ్‌/32 జీబీ మెమరీ, 4 జీబీ ర్యామ్‌/64 జీబీ మెమరీ అనే మూడు వేరియంట్ల రూపంలో లభ్యంకానుంది.

ఈ స్మార్ట్‌ఫోన్స్‌ అమెజాన్, మి.కామ్‌లలో మే 23 నుంచి, ‘మి హోమ్స్‌’లో మే 20 నుంచి అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. షావోమి ఈ స్మార్ట్‌ఫోన్‌తోపాటు తొలిసారిగా ‘మి రూటర్‌ 3సీ’ అనే వై–ఫై రూటర్‌ను కూడా ఆవిష్కరించింది. ఇది 300 ఎంబీపీఎస్‌ స్పీడ్‌ను ఆఫర్‌ చేస్తుందని కంపెనీ తెలిపింది. ధర రూ.1,199.

హైదరాబాద్‌లో షావోమి ఔట్‌లెట్‌!!
‘షావోమి’ భారత్‌లోని ఆఫ్‌లైన్‌ మార్కెట్‌పై ప్రధానంగా దృషిపెట్టింది. అందులోభాగంగానే ఇది ఇటీవల బెంగళూరులో ‘మి హోమ్‌’ అనే సొంత రిటైల్‌ ఔట్‌లెట్‌ను ఏర్పాటు చేసింది. దీని సేవలు మే 20 నుంచి అందుబాటులోకి రానున్నవి. ఇప్పుడు ఈ రిటైల్‌ షాప్స్‌ను నాలుగు ప్రధాన పట్టణాలకు విస్తరించాలని చూస్తోంది. వీటిల్లో హైదరాబాద్‌ కూడా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement