48 ఎంపీ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్‌!

Xiaomi Could Soon Unveil World's first 48MP Smartphone Camera - Sakshi

జనవరిలో మార్కెట్‌లోకి

పరిశీలనలో సోనీ, శాంసంగ్‌ సెన్సార్‌లు

పదేళ్ల క్రితం నోకియా తన మొబైల్స్‌లో కెమెరాలను అప్‌డేట్‌ చేస్తూ మొబైల్‌ మార్కెట్‌ను శాసించిన పరిస్థితులను చూశాము. గత కొద్ది నెలలుగా రిలీజవుతున్న మొబైల్స్‌ను గమనిస్తే ఈ ట్రెండ్‌ మళ్లీ ప్రారంభమైనట్లు అనిపిస్తోంది. ప్రతీ మొబైల్‌ కంపెనీ తమ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లలో కెమెరాలను అప్‌డేట్‌ చేస్తున్నాయి. గతవారం హువావే 40 ఎంపీ కెమెరాతో ట్రిపుల్‌ రియర్‌ కెమెరా ఫోన్‌ రిలీజ్‌ చేసింది. ఇదే క్రమంలో తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను అందిస్తూ ఇండియాలో భారీ మార్కెట్‌ను సాధించిన చైనా మొబైల్‌ దిగ్గజం షావోమీ జనవరిలో బెస్ట్‌ కెమెరాతో దుమ్మురేపే మొబైల్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. 48 మెగాపిక్సెల్‌ భారీ కెమెరాతో ఈ ఫోన్‌ను తయారు చేయనున్నట్లు షావోమీ ప్రెసిడెంట్‌ లిన్‌ బిన్‌ తెలిపారు. ప్రముఖ చైనా టెక్నాలజీ వెబ్‌సైట్‌ వీబోలో ఈ మేరకు వార్త వెలువడింది.

తాను కొద్దివారాల పాటు ఈ మొబైల్‌ను ఉపయోగించినట్లు లిన్‌ వెల్లడించారు. 48 ఎంపీ సెన్సార్‌గా సోనీ ఐఎయ్‌ఎక్స్‌ 586ని గానీ శాంసంగ్‌ ఐసోసెల్‌ బ్రైట్‌ జీఎం1ని గానీ అమర్చే అవకాశముందని తెలిపారు. సోనీ సెన్సార్‌ సూపర్‌ స్లో మోషన్‌ను సపోర్ట్‌ చేయడం లేదని, అయితే ఏదో ఒకటి చేసి దానినే అమర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. ఈ కెమెరాలు రెండూ నాలుగు రెట్ల వరకూ దూరాన్ని జూమ్‌ ద్వారా స్పష్టంగా తీయగలవు. ఇప్పటివరకూ షావోమీ ఈ స్థాయి కెమెరా కలిగిన ఫోన్‌ తయారు చేయలేదు. ఇది ఎంతవరకు విజయం సాధించగలదో చూడాలంటే జనవరి వరకూ ఆగక తప్పదు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top