
హెచ్‌ఎండీ 5జీ స్మార్ట్‌ఫోన్
రెండు 4జీ ఫీచర్ ఫోన్లు కూడా..
నోకియా హ్యాండ్‌సెట్‌ల తయారీదారు హెచ్‌ఎండీ సంస్థ ‘వైబ్ 5జీ’ పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ.8,999 గా ఉంది. కంపెనీ నుంచి రూ.10,000 లోపు ధరలో వస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇది. ఇందులో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్, 50 మెగాపిక్సల్ రియర్ కెమెరా ఉంది.
5000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఈ మొబైల్‌లో అమర్చారు. దీనికి 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ ఉంది. 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు ఏడాది రిప్లేస్‌మెంట్ గ్యారెంటీ సదుపాయం ఉంది. అలాగే హెచ్‌ఎండీ 101 4జీ, 102 4జీ పేరిట రెండు 4జీ ఫీచర్ ఫోన్లను లాంచ్ చేశారు. వీటి ధరలు వరుసగా రూ.1,899, రూ.2,199గా ఉన్నాయి.
ఇదీ చదవండి: ఈక్విటీ ఫండ్స్‌లో తగ్గిన పెట్టుబడుల జోరు!