వావ్‌.. త్రీడీ వాల్‌ | Wow 3d Walls | Sakshi
Sakshi News home page

వావ్‌.. త్రీడీ వాల్‌

Sep 22 2018 3:09 AM | Updated on Sep 22 2018 3:09 AM

Wow 3d Walls - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొత్తగా ఇల్లు కొనుక్కొన్నా.. పాత ఇల్లు అయినా వాల్‌ పేపర్ల సహాయంతో ఇంటిని అందంగా అలంకరించుకోవచ్చు. మార్కెట్లో వాల్‌ పేపర్లు రోల్స్‌ రూపంలో లభ్యమవుతాయి. ఒక్క రోల్‌ కొంటే కనీసం 57 చ.అ. విస్తీర్ణానికి సరిపోతుంది. దీని ప్రారంభ ధర రూ.2 వేల నుంచి ఉంటుంది. గోడ సైజు 10 ఇంటు 10 ఉంటే కనీసం రెండు రోల్స్‌ సరిపోతాయి. గోడకు అంటించడానికి అదనపు చార్జీలుంటాయి. కనీసం రూ.400 వరకుంటుంది.

త్రీడీలో వాల్‌: మారుతున్న అభిరుచులకు అనుగుణంగా ఇంటీరియర్‌ డిజైనర్లు ఎప్పటికప్పుడు కొత్త పోకడలను పరిచయం చేస్తున్నారు. ప్రధానంగా వాల్‌ పేపర్ల విభాగంలో త్రీడీ పేపర్స్, కస్టమైజ్డ్‌ వాల్‌ పేపర్లను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇవి మనం కోరుకున్న డిజైన్లు, సైజుల్లో లభించడమే వీటి ప్రత్యేకత.

దేవుడి బొమ్మలు, కుటంబ సభ్యుల బొమ్మలు, తమ అభిరుచులను ప్రదర్శించే బొమ్మలు వంటివి ఇంట్లోని గోడల మీద అంటించుకోవచ్చు. త్రీడీ వాల్‌ పేపర్లు సుమారు 1/1 సైజ్‌ నుంచి 20/20 సైజ్‌ దాకా లభిస్తాయి. ధర చ.అ.కు రూ.120 నుంచి వరకుంటుంది. త్రీడీ వాల్‌ పేపర్ల నిర్వహణ కూడా చాలా సులువు. మరకలు పడితే తడి గుడ్డతో తుడిస్తే శుభ్రమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement