14 నెలల గరిష్టానికి డబ్ల్యుపీఐ

Wholesale inflation hits 5-month high at 4.43percent  in May - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  డబ్ల్యుపీఐ  మరోసారి పెరిగింది.  మే నెల టోకు ధరల ద్రవ్యోల్బణం 4.45 శాతానికి  పెరిగింది.  దాదాపు14 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. కొన్ని ఆహార పదార్థాలు, ఇంధన ధరలు పెరడంతో డబ్ల్యూపీఐ కూడా గరిష్టానికి చేరింది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గురువారం  ఈ గణాంకాలను విడుదల చేసింది. ఏప్రిల్ నెలలో డబ్ల్యుపిఐ 3.18 శాతం పెరగ్గా , గత ఏడాది మే నెలలో 2.26 శాతం పెరుగుదల  నమోదైంది. ఏప్రిల్ నెలలో 0.89 శాతంతో పోలిస్తే మే నెలలో కూరగాయల ధరలు 2.51 శాతం పెరిగాయి.   

మొత్తం టోకు ధరల సూచీలో ఐదో స్థానంలో ఉన్న ప్రాథమిక వస్తువులు మే నెలలో 3.16 శాతం పెరిగింది.  మే నెలలో పప్పు ధాన్యాల ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్బణం కూడా   పెరిగి 13.15 శాతంగా ఉంది.   ఏప్రిల్లో ఇది 7.85 శాతంగా ఉండగా, గత ఏడాది 11.81 శాతం పెరిగింది. ఏప్రిల్ నెల9.45 శాతందనుంచి  పెట్రోల్ ధరలు మేనెలలో  13.90 శాతం మేర పెరిగాయి. గత ఏప్రిల్లో 13.01 శాతంతో  పోలిస్తే డీజిల్ ధరలు 17. 34 శాతం పెరిగాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top