వాల్‌మార్ట్‌లో వెయ్యి ఉద్యోగాలు : భారీ వేతనం | Walmart plans to ramp up tech hiring in India; 1,000 jobs on the cards | Sakshi
Sakshi News home page

వాల్‌మార్ట్‌లో వెయ్యి ఉద్యోగాలు : భారీ వేతనం

Aug 6 2018 3:16 PM | Updated on Aug 6 2018 3:24 PM

 Walmart plans to ramp up tech hiring in India; 1,000 jobs on the cards - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: ప్రపంచ రీటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ భారతదేశంలో తన ఇ-కామర్స్‌ బిజినెస్‌ను మరో అడుగుపైకి తీసుకెళ్లాలని భావిస్తోంది. టెక్నాలజీ ఆపరేషన్స్‌ విస్తరణకోసం భారీగా టెకీలను నియమించుకునేందుకు సిద్దపడుతోంది. దేశీయంగా దాదాపు వెయ్యిమంది ఉద్యోగులను నియమించుకోనుంది. తద్వారా రీటైల్‌ బిజినెస్‌ రంగంలో మరింత దూసుకుపోవాలని  ప్రణాళికలు రచించింది.

ది ఎకనామిక్ టైమ్స్ ప్రకారం ప్రపంచంలోని అతి పెద్ద రిటైల్ సంస్థ వాల్‌మార్ట్‌   తన ప్రతిభను మరింత ఇనుమడింప చేసేందుకు ప్లాన్‌చేస్తోంది. ఇలా ఎంపిక చేసిన టెకీలకు 6 లక్షలనుంచి 22 లక్షల రూపాయల దాకా వేతనాలను ఆఫర్‌ చేయనుంది. ముఖ్యంగా ఇ-కామర్స్ రంగ దిగ్గజం అమెజాన్‌కు దీటుగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఉత్పత్తి ఆధారితంగా సంస్థగా ఉండేందుకు,  ప్రధానంగా భారతీయ ఉత్పత్తులకు  ప్రోత్సాహమిచ్చేలా కొత్త ప్రాజెక్టులు చేపట్టామని వాల్‌మార్ట్‌ ముఖ్య సమాచార అధికారి క్లే జాన్సన్ వెల్లడించారు. కాగా గురగావ్‌,  బెంగళూరు ద్వారా సేవలను అందిస్తున్న సంస్థలో ప్రస్తుతం​ 1800 మంది ఉద్యోగులున్నారు. సంవత్సరానికి సుమారు 10 బిలియన్ డాలర్ల ఆదాయంతో అమెరికా వెలుపల  వాల్‌మార్ట్‌ ల్యాబ్స్‌ పేరుతో ఇండియాలో అతిపెద్ద వ్యాపారాన్ని నిర్వహిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement