పీటీసీ ఇండియాతో వైజాగ్ స్టీల్ ఒప్పందం | Vizag Steel deal with PTC India | Sakshi
Sakshi News home page

పీటీసీ ఇండియాతో వైజాగ్ స్టీల్ ఒప్పందం

Jun 9 2014 12:29 AM | Updated on Sep 5 2018 1:45 PM

పీటీసీ ఇండియాతో వైజాగ్ స్టీల్ ఒప్పందం - Sakshi

పీటీసీ ఇండియాతో వైజాగ్ స్టీల్ ఒప్పందం

విద్యుత్ సమస్యలను అధిగమించడం కోసం రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ (వైజాగ్ స్టీల్) పీటీసీ ఇండియా సంస్థతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నది.

 న్యూఢిల్లీ: విద్యుత్ సమస్యలను అధిగమించడం కోసం రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ (వైజాగ్ స్టీల్) పీటీసీ ఇండియా సంస్థతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నది. 25 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు నిమిత్తం ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని వైజాగ్ స్టీల్ ఉక్కు మంత్రిత్వ శాఖకు తెలిపింది. గత నెల 14 నుంచే ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిందని తెలిపింది. విద్యుత్ కొరత తమను నిరంతరం వేధిస్తోందని పేర్కొంది. తమ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 29 లక్షల టన్నులని, దీనిని సాధించాలంటే 280 మెగావాట్ల విద్యుత్ అవసరమని వివరించింది. దీంట్లో 250 మెగావాట్ల విద్యుత్తును తమ సొంత ప్లాంట్ల ద్వారా సమకూర్చుకుంటున్నామనిత వైజాగ్ స్టీల్ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement