మార్కెట్లోకి వివో.. ‘యూ10’

ప్రారంభ ధర రూ. 8,990
న్యూఢిల్లీ: చైనాకు ప్రముఖ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ వివో.. ‘యూ10’ పేరుతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను భారత్ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. 3జీబీ ర్యామ్/32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో అందుబాటులోకి వచ్చిన వేరియంట్ ధర రూ. 8,990 కాగా, 64 జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ. 9,990 వద్ద నిర్ణయించింది. టాప్ ఎండ్ వేరియంట్ 4జీబీ ర్యామ్/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో విడుదలైంది. దీని ధర రూ. 10,990. నూతన మోడళ్లు సెప్టెంబర్ 29 నుంచి అమెజాన్ డాట్ కామ్, వివో ఇండియా వెబ్ సైట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. 6.35 అంగుళాల డిస్‌ప్లే.. వెనుకవైపు ట్రిపుల్ (13 మెగాపిక్సెల్, 8ఎంపీ, 2ఎంపీ) కెమెరాలు ఉండగా, సెల్ఫీ కెమెరా 8 ఎంపీ ఉన్నట్లు వివరించింది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చింది.
సంబంధిత వార్తలు