
జీఎస్టీ శ్లాబులను క్రమబద్ధీకరించడంతో ఎలక్ట్రానిక్ ఉపకరణాలతోపాటు ఇతర చాలా వస్తువుల ధరలు దిగొస్తున్నాయి. దాంతోపాటు ఈ-కామర్స్ వెబ్‌సైట్లు చాలానే ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దీనికితోడు పండుగ సీజన్ కావడంతో కంపెనీలు మరిన్ని ఆఫర్లు అందిస్తున్నాయి. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో కొన్ని ఫోన్లపై ఏకంగా రూ.63,000 వరకు డిస్కౌంట్ వస్తున్నట్లు తెలుస్తుంది. ఫోన్లకు సంబంధించి భారీగా రాయితీలు వచ్చే మోడళ్ల వివరాలు కింది విధంగా ఉన్నాయి.
మోడల్ | ఓరిజినల్ ధర | ఆఫర్ ధర | డిస్కౌంట్ | ప్లాట్ఫామ్ |
---|---|---|---|---|
శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా | రూ.1,34,999 | రూ.71,999 | రూ.63,000 | అమెజాన్ |
ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ | రూ.1,44,900 | రూ.89,900 | రూ.55,000 | ఫ్లిప్‌కార్ట్ |
గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ | రూ.1,72,999 | రూ.99,999 | రూ.73,000 | ఫ్లిప్‌కార్ట్ |
నథింగ్ ఫోన్ (3) | రూ.84,999 | రూ.34,999 | రూ.50,000 | ఫ్లిప్‌కార్ట్ |
షావోమి 14 సీవీ | రూ.54,999 | రూ.26,499 | రూ.28,500 | అమెజాన్ |
ఇదీ చదవండి: రూ.15 వేలులోపు 5జీ స్మార్ట్‌ఫోన్లు