జైట్లీతో వేదాంత ‘అగర్వాల్’ భేటీ

జైట్లీతో వేదాంత ‘అగర్వాల్’ భేటీ - Sakshi


న్యూఢిల్లీ: వేదాంత-కెయిర్న్ ఇండియా విలీన ప్రతిపాదనకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సోమవారం వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ భేటీ అయ్యారు. ఈ డీల్‌లో ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ మద్దతు కీలకమయిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. తాను సాధారణంగానే ఆర్థిక శాఖ వర్గాలను కలుస్తుంటానని, వచ్చినప్పుడల్లా కంపెనీ పరిణామాల గురించి వివరిస్తుంటానని భేటీ అనంతరం విలేకరులతో అగర్వాల్ తెలిపారు. తాజా భేటీ కూడా అటువంటిదేనని, వేదాంత-కెయిర్న్ ఇండియా విలీన పరిణామాల గురించి వివరించానని ఆయన చెప్పారు. చమురు, గ్యాస్, అల్యూమినియం, రాగి, జింక్, ముడి ఇనుము వంటివి ఉత్పత్తి చేసే సహజ వనరు దిగ్గజాన్ని భారత్‌లో నెలకొల్పాలన్నదే విలీనం ప్రతిపాదన వెనుక లక్ష్యమని అగర్వాల్ వివరించారు. ఇక, కెయిర్న్ ఇండియాకి రూ. 20,495 కోట్ల పన్ను నోటీసుల విషయం ప్రస్తుతం కోర్టులో ఉందని ఆయన పేర్కొన్నారు. అటు భారత్‌లోని మైనారిటీ ఇన్వెస్టర్లతో ఈ వారంలో, వచ్చే వారంలో బ్రిటన్ ఇన్వెస్టర్లతోనూ సమావేశం కానున్నట్లు వేదాంత సీఈవో టామ్ అల్బనీస్ తెలిపారు.



నగదు నిల్వలు పుష్కలంగా ఉన్న కెయిర్న్ ఇండియాను విలీనం చేసుకోవడం ద్వారా కొంత రుణభారాన్ని తగ్గించుకోవచ్చని వేదాంత భావిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, దీనికి మైనారిటీ వాటాదారుల మద్దతు అవసరం. కెయిర్న్ ఇండియాలో బ్రిటన్‌కు చెందిన కెయిర్న్ ఎనర్జీ (9.82% వాటాలు) తర్వాత అత్యధికంగా ఎల్‌ఐసీకి 9.06 శాతం వాటాలు ఉన్నాయి. ఒకవేళ ఈ రెండూ సానుకూలంగా స్పందించని పక్షంలో విలీన ప్రతిపాదన అటకెక్కే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎల్‌ఐసీ మద్దతు కూడగట్టేందుకు జైట్లీ సహా రెవెన్యూ శాఖ కార్యదర్శి

శక్తికాంత దాస్‌తో అగర్వాల్ భేటీ అయ్యారు.

కెయిర్న్ రూ.20 వేల కోట్ల

పన్ను భారం వేదాంతపైనే: మూడీస్ కెయిర్న్ ఇండియా చెల్లించాల్సి ఉన్న దాదాపు రూ.20,495 కోట్ల పన్నుకు ఇక వేదాంత లిమిటెడ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ పేర్కొంది. అనిల్ అగర్వాల్ గ్రూప్ కంపెనీ వేదాంత లిమిటెడ్‌లో కెయిర్న్ ఇండియా విలీనానికి ఇరు కంపెనీల బోర్డులు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. కాగా, కెయిర్న్ ఇండియాలో మెజారిటీ వాటాను గతంలో కెయిర్న్ ఎనర్జీ నుంచి వేదాంత రిసోర్సెస్ కొనుగోలు చేసింది. అయితే, ప్రమోటర్ సంస్థ కెయిర్న్ ఎనర్జీ ఆర్జించిన మూలధన లాభాలకు గాను విత్‌హోల్డింగ్ పన్నును మినహాయించనందున.. రూ.20,595 కోట్ల మొ త్తాన్ని కెయిర్న్ ఇండియాయే చెల్లించాంటూ ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ ఆ డీల్ జరిగేనాటికే పన్ను నోటీసులు జారీచేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top