breaking news
Vedanta Group Chairman Anil Agarwal
-
వేదాంత గ్రూప్ ఓ పేకమేడ..!
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌ను హిండెన్‌బర్గ్ రీసెర్చ్ లక్ష్యంగా చేసుకున్నట్లుగా తాజాగా మరో దిగ్గజం వేదాంత గ్రూప్‌ను ఇంకో అమెరికన్ షార్ట్‌సెల్లింగ్ సంస్థ వైస్రాయ్ రీసెర్చ్ టార్గెట్ చేసింది. వేదాంత గ్రూప్ అనేది భారీ అప్పులు, కొల్లగొట్టిన ఆస్తులు, కల్పిత అకౌంటింగ్ గాధలతో కట్టిన ఓ పేకమేడలాంటిది అని ఓ సంచలన నివేదికలో ఆరోపించింది. హోల్డింగ్ కంపెనీ అయిన వేదాంత రిసోర్సెస్ (వీఆర్ఎల్), భారత అనుబంధ సంస్థను పారసైట్‌లాగా భ్రష్టు పట్టిస్తోందని 85 పేజీల రిపోర్టులో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘వేదాంత రిసోర్సెస్ ఓ పారసైట్‌లాంటి హోల్డింగ్ కంపెనీ. అదొక పోంజీ స్కీము నడిపిస్తోంది. దానికంటూ చెప్పుకోతగ్గ కార్యకలాపాలేమీ లేవు. భారతీయ విభాగం వేదాంత లిమిటెడ్‌ను (వీఈడీఎల్) కొల్లగొడుతూ బతికేస్తోంది‘ అని వీఆర్ఎల్ బాండ్లలో షార్ట్ పొజిషన్లు తీసుకున్న వైస్రాయ్ రీసెర్చ్ పేర్కొంది. మాతృ సంస్థకు డివిడెండ్ల రూపంలో వేల కోట్లు సమర్పించుకున్నాక వీఈడీఎల్ దగ్గర నగదు నిల్వలు పూర్తిగా ఖాళీ అయిపోయాయని, ఎక్కడా అప్పు పుట్టే పరిస్థితి కూడా లేకుండా పోయిందని తెలిపింది. ఇంతగా నిధులు వస్తున్నప్పటికీ, వీఆర్ఎల్ వడ్డీ వ్యయాలు వార్షికంగా 200 మిలియన్ డాలర్ల మేర పెరిగినట్లు వివరించింది. కంపెనీ 9–11 శాతం వడ్డీ రేటుతో బాండ్లను ఇష్యూ చేయగా, వడ్డీ భారాన్ని చూస్తుంటే ఏకంగా 15.8 శాతం స్థాయిలో కనిపిస్తోందని నివేదిక తెలిపింది. ఇదంతా చూస్తుంటే ఓ స్థాయిలో ఆర్థిక అవకతవకలు చోటు చేసుకుంటున్నట్లు ఉందని వివరించింది. వేరే ఖర్చులను వడ్డీల రూపంలో మోసపూరితంగా చూపిస్తుండటం, సిసలైన రుణభారం తెలియకుండా అధిక వడ్డీ రేట్లకు స్వల్పకాలిక రుణాలను తీర్చేస్తుండటం, లేదా రుణ రేట్లు .. షరతులను సరిగ్గా వెల్లడించకపోవడంలాంటివి కారణాలుగా ఉండొచ్చని పేర్కొంది. నిరాధార ఆరోపణలు: వేదాంత గ్రూప్ వార్షిక సర్వ సభ్య సమావేశంలో వేదాంత లిమిటెడ్ చైర్మన్ అనిల్ అగర్వాల్ పాల్గొనడానికి ఒక రోజు ముందు ఈ నివేదిక వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది. రిపోర్టును బైటపెట్టిన సమయం చూస్తే, వైస్రాయ్ రీసెర్చ్ తీరు సందేహాలకు తావిచ్చేదిగా ఉందని వేదాంత గ్రూప్ పేర్కొంది. ఇదంతా నిరాధార ఆరోపణలు, వారికి అనువైన సమాచారాన్ని ఉపయోగించుకుని చేస్తున్న విషపూరిత ప్రచారమని తెలిపింది. వివరణ కోసం వైస్రాయ్ రీసెర్చ్ తమను కనీసం సంప్రదించకుండానే రిపోర్ట్ తయారైందని పేర్కొంది. అయితే, దీనికి వైస్రాయ్ రీసెర్చ్ కౌంటర్ ఇచ్చింది. తమ రిపోర్టును వేదాంత గ్రూప్ తోసిపుచ్చలేదని, ప్రశ్నలేవైనా ఉంటే సమాధానాలివ్వడానికి సిద్ధంగా ఉన్నామని మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. వైస్రాయ్ రీసెర్చ్ రిపోర్ట్ దెబ్బతో వేదాంత షేర్లు బుధవారం బీఎస్ఈలో 6 శాతం పడిపోయింది. తర్వాత కొంత కోలుకుని 3.4 శాతం నష్టంతో రూ. 440.80 వద్ద క్లోజయ్యింది. -
చిప్ ప్లాంటుకు భాగస్వామి సిద్ధం..
న్యూఢిల్లీ: సెమీకండక్టర్ ప్లాంటు ఏర్పాటు కోసం భాగస్వామిని సిద్ధం చేసుకున్నట్లు వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ తెలిపారు. ఈ ఏడాదే చిప్‌ల తయారీని ప్రారంభించనున్నట్లు కంపెనీ 58వ షేర్‌హోల్డర్ల సమావేశంలో వివరించారు. అయితే, భాగస్వామి పేరు మాత్రం ఆయన వెల్లడించలేదు. రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడులతో సెమీకండక్టర్ ప్లాంటు నెలకొల్పేందుకు వేదాంతతో కుదుర్చుకున్న జాయింట్ వెంచర్ నుంచి ఫాక్స్‌కాన్ తప్పుకున్న నేపథ్యంలో అగర్వాల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తమ అనుబంధ సంస్థ ఎవాన్్రస్టేట్.. గ్లాస్ సబ్్రస్టేట్స్ తయా రీలో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉందని, సొంత పేటెంట్లు కూడా ఉన్నాయని అగర్వాల్ చెప్పారు. మరోవైపు, భారత్‌లో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడాన్ని వేదాంత కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు 35 బిలియన్ డాలర్ల పైగా (దాదాపు రూ. 2.9 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేసినట్లు చెప్పారు. కార్యకలాపాల విస్తరణ కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 1.7 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 14,000 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించారు. -
9 వ్యాపారాలు దెబ్బకొడితే.. నేడు రూ.1.5 లక్షల కోట్ల వ్యాపారానికి అధినేత
ఆయనేం బడా వ్యాపార కుటుంబంలో పుట్టలేదు. తొమ్మిది వ్యాపారాలు దెబ్బకొట్టాయి. మానసికంగా కుంగదీశాయి. అయినా నిలబడ్డాడు. కసిగా శ్రమించి వ్యాపారంలో విజయవంతమయ్యారు. నేడాయన రూ. 1.5 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత. ఆయనే వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, చైర్మన్ అనిల్ అగర్వాల్. అనిల్ అగర్వాల్ ఇటీవల ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఆహ్వానం అందింది. అక్కడ విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కలలను ఎలా సాకారం చేసుకోవాలో విద్యార్థులకు వివరించారు. 19 ఏళ్ల వయసులోనే పాట్నాలోని మార్వాడీ కుటుంబంలో ఒక చిన్న వ్యాపారికి అనిల్ అగర్వాల్ జన్మించారు. చాలా చిన్న వయసులోనే తన తండ్రి వ్యాపారాన్ని విస్తరించాలని నిర్ణయించుకున్న ఆయన కెరీర్ అవకాశాలను అన్వేషించడానికి 19 సంవత్సరాల వయసులోనే ముంబైకి వచ్చేశారు. 1970లో స్క్రాప్ డీలర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. కేంబ్రిడ్జ్‌లో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ "నేను 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయసులో చాలా కష్టాలు పడ్డాను. విజవంతమైన వ్యక్తులను చూస్తూ నేను కూడా ఏదో ఒక రోజు ఆ స్థాయికి రావాలని కలలు కనేవాడిని. అలా ఎన్నో వ్యాపారాలు చేశారు. 9 వ్యాపారాలు దెబ్బకొట్టాయి. సంవత్సరాల నిరాశ తర్వాత విజయాన్ని అందుకున్నాను" అన్నారు. ఇదీ చదవండి: Chandigarh Couple: చలికాలం ఈ భార్యాభర్తలను రూ. కోట్ల వ్యాపారవేత్తలను చేసింది! ఎప్పుడూ కాలేజీకి వెళ్లని తనను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆహ్వానించడం.. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడం అనేది ఒక కల కంటే తక్కువేమీ కాదు.. అని అనిల్ అగర్వాల్ ట్విటర్ తన అనుభవాన్ని ట్విటర్లో షేర్ చేశారు. అనిల్ అగర్వాల్ నికర సంపద అనిల్ అగర్వాల్‌కు సోషల్ మీడియాలో విస్తృతమైన ఫాలోవర్లు ఉన్నారు. స్ఫూర్తిదాయకమైన అంశాలను ఆయన ఫాలోవర్లతో పంచుకుంటుంటారు. ప్రస్తుతం ఆయనకు ట్విటర్లో 1,63,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫోర్బ్స్ ప్రకారం.. అనిల్ అగర్వాల్ నికర సంపద దాదాపు రూ.16,000 కోట్లు. ఇక ఆయన కుటుంబ నికర సంపద రూ.32000 కోట్లకుపైగా ఉంది. As someone who never went to college, being invited to cambridge university and speaking with the students was nothing short of a dream… I was surrounded by bright 20 year olds who firmly shook my hands and introduced themselves with a big smile…i remember when i was their… pic.twitter.com/GpeOqqnCWM — Anil Agarwal (@AnilAgarwal_Ved) June 23, 2023 -
ఆర్థిక వ్యవస్థకు వెలుగురేఖ కనిపించింది..!
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ 11 ఏళ్ల కనిష్ట స్థాయి నుంచి త్వరలోనే పుంజుకుంటుందని మైనింగ్ దిగ్గజం, వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ పేర్కొన్నారు. కార్పొరేట్ పన్నును భారీగా తగ్గించినందున అది పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తుందని, అలాగే, మౌలిక సదుపాయాలపై పెద్ద ఎత్తున చేసే పెట్టుబడులతో ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ చెందుతుందని అభిప్రాయపడ్డారు. మౌలిక సదుపాయాలపై వ్యయాలతోపాటు, దేశంలో దాగి ఉన్న సహజ వనరులను వెలికితీసే విషయమై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. అలాగే, అధిక శాతం ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయాన్ని పరిశీలించాలని కూడా సూచించారు. ప్రభుత్వరంగ కంపెనీలు స్వతంత్రంగా పనిచేయగలిగితే ప్రస్తుత స్థాయికి మూడు రెట్లు అధికంగా ఉత్పత్తి చేయగలవన్నారు. ‘‘ఆర్థిక వ్యవస్థ తిరిగి అధిక వృద్ధి బాట పడుతుంది. సొరంగం చివర్లో వెలుగును నేను చూశాను. ఇది ఎంతో దూరంలో లేదు’’ అని అనిల్ అగర్వాల్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. జీఎస్టీ ప్రభావం తాత్కాలికమేనని, ఇది గాడిన పడినట్టు చెప్పారు. గతేడాది జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు 4.5 శాతానికి పడిపోయిన విషయం తెలిసిందే. వృద్ధి రేటుకు ప్రోత్సాహకంగా కేంద్రం కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించిన విషయం గమనార్హం. నిబంధనల అడ్డు తొలగించాలి.. ప్రపంచంలో తక్కువ పన్ను రేట్లు ఉన్న భారత్ పెట్టుబడులకు సహజ గమ్యస్థానమని అనిల్ అగర్వాల్ అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో వ్యాపారాలు చేయాలనుకునే వారికి భారత్ ఉత్తమ ప్రదేశంగా ఆయన పేర్కొన్నారు. -
జైట్లీతో వేదాంత ‘అగర్వాల్’ భేటీ
న్యూఢిల్లీ: వేదాంత-కెయిర్న్ ఇండియా విలీన ప్రతిపాదనకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సోమవారం వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ భేటీ అయ్యారు. ఈ డీల్‌లో ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ మద్దతు కీలకమయిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. తాను సాధారణంగానే ఆర్థిక శాఖ వర్గాలను కలుస్తుంటానని, వచ్చినప్పుడల్లా కంపెనీ పరిణామాల గురించి వివరిస్తుంటానని భేటీ అనంతరం విలేకరులతో అగర్వాల్ తెలిపారు. తాజా భేటీ కూడా అటువంటిదేనని, వేదాంత-కెయిర్న్ ఇండియా విలీన పరిణామాల గురించి వివరించానని ఆయన చెప్పారు. చమురు, గ్యాస్, అల్యూమినియం, రాగి, జింక్, ముడి ఇనుము వంటివి ఉత్పత్తి చేసే సహజ వనరు దిగ్గజాన్ని భారత్‌లో నెలకొల్పాలన్నదే విలీనం ప్రతిపాదన వెనుక లక్ష్యమని అగర్వాల్ వివరించారు. ఇక, కెయిర్న్ ఇండియాకి రూ. 20,495 కోట్ల పన్ను నోటీసుల విషయం ప్రస్తుతం కోర్టులో ఉందని ఆయన పేర్కొన్నారు. అటు భారత్‌లోని మైనారిటీ ఇన్వెస్టర్లతో ఈ వారంలో, వచ్చే వారంలో బ్రిటన్ ఇన్వెస్టర్లతోనూ సమావేశం కానున్నట్లు వేదాంత సీఈవో టామ్ అల్బనీస్ తెలిపారు. నగదు నిల్వలు పుష్కలంగా ఉన్న కెయిర్న్ ఇండియాను విలీనం చేసుకోవడం ద్వారా కొంత రుణభారాన్ని తగ్గించుకోవచ్చని వేదాంత భావిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, దీనికి మైనారిటీ వాటాదారుల మద్దతు అవసరం. కెయిర్న్ ఇండియాలో బ్రిటన్‌కు చెందిన కెయిర్న్ ఎనర్జీ (9.82% వాటాలు) తర్వాత అత్యధికంగా ఎల్ఐసీకి 9.06 శాతం వాటాలు ఉన్నాయి. ఒకవేళ ఈ రెండూ సానుకూలంగా స్పందించని పక్షంలో విలీన ప్రతిపాదన అటకెక్కే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎల్ఐసీ మద్దతు కూడగట్టేందుకు జైట్లీ సహా రెవెన్యూ శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్‌తో అగర్వాల్ భేటీ అయ్యారు. కెయిర్న్ రూ.20 వేల కోట్ల పన్ను భారం వేదాంతపైనే: మూడీస్ కెయిర్న్ ఇండియా చెల్లించాల్సి ఉన్న దాదాపు రూ.20,495 కోట్ల పన్నుకు ఇక వేదాంత లిమిటెడ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ పేర్కొంది. అనిల్ అగర్వాల్ గ్రూప్ కంపెనీ వేదాంత లిమిటెడ్‌లో కెయిర్న్ ఇండియా విలీనానికి ఇరు కంపెనీల బోర్డులు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. కాగా, కెయిర్న్ ఇండియాలో మెజారిటీ వాటాను గతంలో కెయిర్న్ ఎనర్జీ నుంచి వేదాంత రిసోర్సెస్ కొనుగోలు చేసింది. అయితే, ప్రమోటర్ సంస్థ కెయిర్న్ ఎనర్జీ ఆర్జించిన మూలధన లాభాలకు గాను విత్‌హోల్డింగ్ పన్నును మినహాయించనందున.. రూ.20,595 కోట్ల మొ త్తాన్ని కెయిర్న్ ఇండియాయే చెల్లించాంటూ ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ ఆ డీల్ జరిగేనాటికే పన్ను నోటీసులు జారీచేసింది.