5వేల యుఐడిఎఐ అధికారులకు షాక్‌ | UIDAI firewalls 5,000 officials post breach | Sakshi
Sakshi News home page

5వేల యుఐడిఎఐ అధికారులకు షాక్‌

Jan 9 2018 1:45 PM | Updated on Sep 13 2018 5:25 PM

UIDAI firewalls 5,000 officials post breach - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆధార్‌ డేటా బ్రీచ్‌ వ్యవహారం పై యుఐడిఎఐ   సంచలన నిర్ణయం తీసుకుంది.  అన్ని స్థాయిల్లో భారీ సంఖ్యలో ఉద్యోగులపై ఆంక్షలు విధిస్తూ  అధికారులకు షాకిచ్చినట్టు తెలుస్తోంది. యుఐడిఎఐ   వ్యవస్థలో యాక్సెస్‌పై దాదాపు 5వేల మంది అధికారుల అధికారాలను కోత పెట్టిందని  సీనియర్‌ అధికారి వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఎకనామిక్స్‌  టైమ్స్‌  నివేదించింది.

ఆధార్‌ యాక్సెస్ కోసం అధికారులకు ఇచ్చిన అన్ని ప్రత్యేక అధికారాలను తక్షణమే ఉపసంహరించుకుందని పేరు చెప్పడానికి ఇష్టపడని సీనియర్‌ ప్రభుత్వ అధికారి తెలిపారు.యుఐడిఎఐ వ్యవస్థను పునఃపరిశీలిస్తున్న నేపథ్యంలో  సంబంధిత అధికారి వివరాలను పూర్తిగా పరిశీలించిన అనంతరం  కేవలం బయోమెట్రిక్‌  ద్వారా మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు పేర్కొన్నారు.

 ప్రస్తుత వ్యవస్థ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కొంతమంది ప్రభుత్వ అధి​కారులతోపాటు ఇతర  ప్రైవేట్ ఆపరేటర్లకు  "పరిమితమైన" యాక్సెస్‌ ఉంది.  ముఖ్యంగా  12 ఏళ్ల ప్రత్యేక గుర్తింపు సంఖ్యను నమోదు చేయడం ద్వారా పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొదలైన ఆధార్ హోల్డర్ వివరాలను వీక్షించేందుకు వీరికి అనుమతి ఉంది.  తద్వారా ఆధార్‌లో  మార్పులు, చేర్పులు చేసేందుకు అవకాశం కల్పించింది. ఆధార్‌ మార్పుల కోసం 5 లక్షల రిక్వెస్టులు యుఐడిఎఐ వస్తున్నాయిని తెలిపారు. తాజా మార్పు ప్రకారం ఆధార్‌ కార్డ్‌ హోల్డర్‌  వేలిముద్రల ద్వారా యాక్సెస్‌ను ప్రామాణీకరిస్తారు. దీంతో  అందుబాటులో ఉన్న సమాచారం ఆ వ్యక్తికి పరిమితం చేయబడుతుంది.  ఈ చర్య   తాత్కాలికంగా కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ  భవిష్యత్తులో హ్యాకింగ్‌లను నివారించగలదని భావిస్తున్నామని అధికారి తెలిపారు.

కాగా కేవలం రూ.500లకే  ఆధార​ కార్డ్‌  డేటా వివరాలు  లభ‍్యమని ది ట్రిబ్యూన్ వార్తాపత్రిక నివేదించడం  సంచలనం రేపింది. అయితే ఈ వార్తలను ఖండించిన  యుఐడిఎఐ సదరు జర్నలిస్టుపై కేసు నమోదు చేయడం మరింత  విమర్శలకు దారి తీసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement