
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫుడ్ డెలివరీ కంపెనీ ఉబెర్ ఈట్స్ విజయవాడలో సేవలను ప్రారంభించింది. ప్యారడైజ్, క్రీమ్‌స్టోన్, డ్రన్‌కీన్ మంకీ, సెవెన్ డేస్, సదరన్ స్పైస్ వంటి స్థానిక రెస్టారెంట్లతో ఉబెర్ ఈట్స్ ఒప్పందం చేసుకుంది. ఉబెర్ రైడ్స్ కంటే ముందు ఉబెర్ ఈట్స్ సేవలను ప్రారంభించిన తొలి నగరం విజయవాడేనని ఉబెర్ ఈట్స్ హెడ్ భావిక్ రాథోడ్ ఒక ప్రకటనలో తెలిపారు.
తొలి ఐదు ఆర్డర్లకు 50 శాతం డిస్కౌంట్ ఉంటుందని.. కనీస ఆర్డర్ విలువ రూ.100గా నిర్ణయించామని ప్రతి డెలివరీ మీద రూ.10 డెలివరీ చార్జీ ఉంటుందని కంపెనీ తెలిపింది. విశాఖపట్నంలోనూ ఉబెర్ ఈట్స్ సేవలు అందుబాటులో ఉన్నాయి.