ట్విట్టర్ యూజర్స్ కి శుభవార్త | Twitter allows users to share 140-second videos | Sakshi
Sakshi News home page

ట్విట్టర్ యూజర్స్ కి శుభవార్త

Jun 22 2016 12:43 PM | Updated on Sep 4 2017 3:08 AM

ట్విట్టర్ యూజర్స్ కి శుభవార్త

ట్విట్టర్ యూజర్స్ కి శుభవార్త

ట్విట్టర్ లో పోస్ట్ చేసే లేదా షేర్ చేసే వీడియోల పరిమితిని 140 సెకండ్లకు పెంచింది.

సోషల్ నెట్‌వర్కింగ్ సైట్  ట్విట్టర్ తన  ఖాతాదారులకు  మరో శుభవార్త అందించింది.  మార్కెట్ లో  ప్రత్యర్థుల పోటీని తట్టుకొని నిలబడే క్రమంలో 140 అక్షరాల పరిమితిని తొలగించిన ట్విట్టర్ ఇపుడు యూజర్లకు మరో  వెసులుబాటును కల్పించింది.  ట్విట్టర్ లో పోస్ట్ చేసే లేదా షేర్ చేసే వీడియోల పరిమితిని 140 సెకండ్లకు  పెంచింది.  ఇది  ట్విట్టర్స్  ఓపెన్  ప్రోగ్రాం 'వైన్ '  కూడా ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది. దీంతోపాటు మరికొన్ని ఆఫర్లను ట్విట్టర్ కో ఫౌండర్ జాక్ డోర్సే  ప్రకటించారు.   లండన్ కు చెందిన స్టార్టప్ కంపెనీ, బెటర్ వీడియో, పిక్చర్ కంటెంట్ ను అందించే మ్యాజిక్ పోనీ టెక్నాలజీ సంస్థను  టేక్ ఓవర్ చేసిన తరువాత ఈ నూతన మార్పులకు శ్రీకారం చుట్టింది.  
 
గతంలో 30 సెకండ్లకు మాత్రమే  పరిమితమైన  వీడియో షేరింగ్  నిడివి ఇపుడు 140 సెకండ్లకు పెంచిది.   దీంతోపాటు... తమ వీడియో స్ట్రీమింగ్ సర్వీస్  'వైన్' ద్వారా డబ్బులను ఆర్జించే పద్ధతికి కూడా అనుమతిస్తోంది. అలాగే వెన్ లో పోస్ట్ చేసే వీడియో నిడివి గతంలో  ఆరు సెకండ్లను కూడా 140  సెకండ్లకు పెంచడం విశేషంగా మారింది. ఫేస్ బుక్, యూ ట్యూబ్ ల దీటుగా ఖాతాదారులను పెంచుకునేందుకు యోచిస్తోంది. ముఖ్యంగా   ఫేస్బుక్ ఇంక్ , ఇన్ స్టా గ్రామ్ ల నుంచి మొబైల్ వీడియో   రంగంలో పెరుగుతున్న  పోటీని తట్టుకునేందుక వీలుగా ఈ  చర్యలు తీసుకుంది.
 

అలాగే ట్విట్టర్ ఎంగేజ్ అనే మొబైల్  యాప్ కూడా లాంచ్  చేసినట్టు  డోర్సే  వెల్లడించారు. 2016 ప్రారంభంతో పోలిస్తే తమ వీడియో  ట్విట్స్  సంఖ్య 50 శాతానికి పైగా పెరుగిందన్నారు.  అయితే మంగళవారం మార్కెట్ లో ట్విట్టర్ షేర్ స్వల్ప నష్టాల్లో కొనసాగుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement