కడప-హైదరాబాద్ మధ్య ట్రూజెట్ విమాన సర్వీసులు | TruJet to fly on Hyderabad-Kadapa, Kadapa-Tirupati sectors | Sakshi
Sakshi News home page

కడప-హైదరాబాద్ మధ్య ట్రూజెట్ విమాన సర్వీసులు

Apr 8 2016 2:15 AM | Updated on Oct 2 2018 7:37 PM

కడప-హైదరాబాద్ మధ్య ట్రూజెట్ విమాన సర్వీసులు - Sakshi

కడప-హైదరాబాద్ మధ్య ట్రూజెట్ విమాన సర్వీసులు

కడప నుంచి హైదరాబాద్‌కు ట్రూజెట్ విమాన సర్వీసులు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దాదాపు ఓల్వో బస్సు టికెట్

సాక్షి ప్రతినిధి, కడప: కడప నుంచి హైదరాబాద్‌కు ట్రూజెట్ విమాన సర్వీసులు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దాదాపు ఓల్వో బస్సు టికెట్ ధరలతో సమానంగానే విమానాల్లో చార్జీ ఉంటుందని ట్రూజెట్ ఎండీ ఉమేష్ మీడియాకు వెల్లడించారు. వారంలో నాలుగు రోజుల (శుక్ర, శని, ఆది, సోమ) పాటు సర్వీసులు ఉంటాయని చెప్పారు. మే 3వ తేది నుంచి విజయవాడ-కడప మధ్య  విమాన సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో కడప నుంచి గోవా, బెంగుళూరు, చెన్నై, ఔరంగబాద్ (షిరిడి) సర్వీసులు కూడా నడపనున్నట్లు  వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement