హయ్యర్‌ నుంచి అత్యాధునిక రిఫ్రిజిరేటర్‌ | Trendy refrigerator From Haier | Sakshi
Sakshi News home page

హయ్యర్‌ నుంచి అత్యాధునిక రిఫ్రిజిరేటర్‌

Sep 4 2018 8:06 AM | Updated on Sep 4 2018 8:06 AM

Trendy refrigerator From Haier - Sakshi

హైదరాబాద్‌: చైనాకు చెందిన హయ్యర్‌ ప్రీమియం గ్లాస్‌ ఫినిష్‌తో, పక్క, పక్కన డోర్లతో కూడిన అత్యాధునిక రిఫ్రిజిరేటర్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. చాక్లెట్, బ్లాక్‌ గ్లాస్‌ ఫినిష్‌తో రెండు రకాలుగా ఇది లభిస్తుందని కంపెనీతెలియజేసింది.

ప్రత్యేక ఫీచర్లు
మెరుగైన పనితీరుతో పాటు అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయని పేర్కొంది. అడ్డంగా ఉండే డిజిటల్‌ కంట్రోల్‌ ప్యానల్‌ను పై భాగంలో కుడివైపున ఏర్పాటు చేసింది. క్విక్‌ కూల్, జీరో డిగ్రీ ఫ్రెష్, ఫిష్, మీట్, డ్రై ఫ్రూట్స్, సూపర్‌ కూల్, సూపర్‌ ఫ్రీజ్‌ ఫీచర్లు ఉన్నాయి. 688 లీటర్ల సైజు కలిగిన ఈ రిఫ్రిజిరేటర్‌లో 420 లీటర్ల రిఫ్రిజిరేటర్‌ సెక్షన్‌ కాగా, 261 లీటర్లు ఫ్రీజర్‌ సెక్షన్‌ కోసం కేటాయించింది. హెచ్‌ఆర్‌ఎఫ్‌–748సీజీ/కేజీ మోడల్‌ ధర రూ.1,01,000.

Advertisement
 
Advertisement
Advertisement