ఇన్‌కమింగ్‌ కాల్‌ రింగ్‌ ఇకపై 30సెకన్లు ఉండాల్సిందే!!

TRAI SaysTelecom Operators Have To Offer Ring Time Of 30 Seconds For Calls - Sakshi

న్యూఢిల్లీ : మొబైల్ రింగ్‌పై టెలికం ఆపరేటర్ల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మొబైల్ ఫోన్‌‌కు చేసే ఇన్‌‌కమింగ్ కాల్స్‌‌ రింగ్ టైమ్ కనీసం 30 సెకన్లు ఉండాలని టెలికాం రెగ్యులేటరీ సంస్థ (ట్రాయ్) నిర్దేశించింది. ల్యాండ్‌‌లైన్స్‌‌కు చేసే కాల్స్‌‌కు అయితే 60 సెకన్ల పాటూ ఉండాలని ట్రాయ్‌ పేర్కొంది. ట్రాయ్‌ నిర్దేశకాలు జారీచేయడానికి ముఖ్య కారణం ఇప్పటివరకు టెలికాం కంపెనీలు పోటాపోటీగా ఇన్ కమింగ్ కాల్ రింగ్ సమయాన్ని తగ్గించడమే. వాస్తవానికి గతంలో ఇన్ కమింగ్ రింగ్ సమయానికి ఎలాంటి పరిమితి లేదు.

ఎవరైనా కాల్ చేస్తే 45 సెకండ్ల పాటు రింగ్ అవుతూ ఉండేది. కాల్ లిఫ్ట్ చేయకపోతే 45 సెకండ్ల తర్వాత డిస్‌కనెక్ట్ అయ్యేది. మొదట ఇన్ కమింగ్ కాల్ రింగ్ సమయాన్ని జియో 25 సెకన్లకు తగ్గించింది. అనంతరం ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ కూడా అదేవిధంగా 25 సెకన్లకు తగ్గించాయి. దీంతో వినియోగదారులు ఫోన్ ఎత్తేలోపే లైన్ కట్ అవుతండడంతో అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. ఇకపై కాల్ ఎత్తకపోయినా లేదా రిజక్ట్ చేసినా.. ఇన్‌‌కమింగ్ వాయిస్ కాల్స్‌‌ అలర్ట్‌‌కు ఈ సమయాభావాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఆపరేటర్లకు తెలిపింది. ట్రాయ్‌ తీసుకున్న తాజా నిర్ణయంతో టెలికాం సంస్థల మధ్య నెలకొన్న పోటీకి తెరపడినట్టే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top